ఒక వాహనంలో 18 మంది ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: మహింద్రా స్కార్పియో వాహనంలో 18 మంది ప్రయాణించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే వందలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ నెల 4న ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేశారు.
also read:మలివిడత జాబితా: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు
స్కార్పియో వాహనం నుండి ప్రయాణీకులు దిగుతున్న సమయంలో వాహనంలో ఎంతమంది ప్రయాణించారో లెక్కించడం కన్పిస్తుంది. వాహనంలో మొత్తం 18 మంది ప్రయాణించినట్టుగా ఈ వీడియోలో కన్పిస్తుంది. 18 మంది ఒకే వాహనంలో ప్రయాణించడంపై అందరూ నవ్వుకున్నారు.ఓ ఫంక్షన్ కు ఈ స్కార్పియో వాహనంలో వీరంతా ప్రయాణించారు.
also read:కాంగ్రెస్ వైపు కోనప్ప చూపు: బీఆర్ఎస్ కు షాకిస్తారా?
Desi people when they go to any marriage or function pic.twitter.com/L2yyYWHARJ
— narsa. (@rathor7_)ఈ వీడియో ఆన్‌లైన్ లో పోస్టు చేసిన వెంటనే 76 వేలకు పైగా మంది వీక్షించారు. ఈ వీడియోను షేర్ చేశారు. లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోజీలతో నింపారు. భారతదేశంలో ఏదైనా సాధ్యమేనని ఒకరు వ్యాఖ్యానించారు. భారత దేశం ప్రారంభకులకు కాదు అని మరొక నెటిజన్ పేర్కొన్నారు.