కాశీలో శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు.. దేశాభివృద్ధికి కాశీ సహకారం అంతులేనిది: ప్రధాని నరేంద్ర మోదీ

Published : Dec 13, 2021, 03:07 PM IST
కాశీలో శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు.. దేశాభివృద్ధికి కాశీ సహకారం అంతులేనిది: ప్రధాని నరేంద్ర మోదీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం వారణాసిలో కాశీ విశ్వనాథ్ దామ్ కారిడార్‌ను (Kashi Vishwanath Dham corridor) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశీలో (Kashi) అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుందని  అన్నారు. కాశీలో అడుగుపెట్టగానే అంతరాత్మ మేల్కొంటుందని చెప్పారు.

కాశీలో (Kashi) అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. కాశీలో అడుగుపెట్టగానే అంతరాత్మ మేల్కొంటుందని చెప్పారు. అందరికి కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉంటాయని.. కాశీ విశ్వనాథుని పాదాలకు నమస్కరిస్తున్నాని చెప్పారు. ఎన్నో ఏళ్లు వేచిచూసిన సమయం ఆసన్నమైంది అని మోదీ అన్నారు. ఈనాటి కార్యక్రమంతో గంగానది ప్రసన్నమైందని చెప్పుకొచ్చారు. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధగా ఉందని అన్నారు. కాశీలో శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదని అన్నారు. కాశీ ప్రేమకు చిరునామా అని అన్నారు. కాశీలో మృత్యువు కూడా మంగళమే అని అన్నారు. కాశీలో ప్రతి జీవిలో కూడా విశ్వేశ్వరుడే కనిపిస్తాడని తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ మొద‌టి ద‌శ‌ను ప్రారంభించారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్ని (Kashi Vishwanath Temple) ఈ కారిడర్ కలపనుంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోదీ  2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని  ప్రాజెక్టులో 23 భవనాలను మోదీ ప్రారంభించారు. 

Also read: PM Modi: గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ.. కాలభైరవునికి ప్రత్యేక పూజలు


ఈ సందర్భగా మోదీ మాట్లాడుతూ.. నమామి గంగే విజయాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. మనం లోకల్ ఫర్ వోకల్ కోసం పనిచేయాలని.. పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ గురించి గర్వపడాలని సూచించారు. నేటి భారతదేశం దేవాలయాను పునరుద్దించడమే కాకుండా.. పేదలకు పక్క ఇళ్లను కూడా నిర్మిస్తుందని అన్నారు. వారసత్వం ఉందని.. అభివృద్ది కూడా ఉందని(విరాసత్ భీ హై, వికాస్ భీ హై) వ్యాఖ్యానించారు. 

‘కాశీ నగరానికి అనేక యుగాల చరిత్ర ఉంది.. అనే సామ్రాజ్యాల వైభవం, పతనాలను చూసిందన్నారు. కానీ కాల పరీక్షకు నిలబడింది. ఎంత మంది ఋషులు, ఆచార్యులు పుణ్యభూమి కాశీతో సంబంధాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడియాడిన నేల ఇది. రాణిలక్ష్మీబాయి నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వరకు ఎందరో పోరాటయోధుల జన్మస్థలం కాశీ. కాశీ అనంతం అయినట్లే.. దేశాభివృద్దికి దాని సహకారం కూడా అంతులేనిది. కాశీ ప్రతి దాడికి ఒక రక్షకుడిని చూపించింది’ అని మోదీ అన్నారు.

‘కాశీలో ప్రవేశించిన వెంటనే సర్వ బంధాల నుండి విముక్తి పొందుతారని మన పురాణాలలో చెప్పబడింది. భగవంతుడు విశ్వనాథుని ఆశీస్సులు, ఒక అతీంద్రియ శక్తి ఇక్కడికి రాగానే మన అంతరంగాన్ని మేల్కొల్పుతుంది. విశ్వనాథ్ ధామ్ యొక్క ఈ సరికొత్త సముదాయం కేవలం ఒక గొప్ప భవనం మాత్రమే కాదు. ఇది మన భారతదేశ సనాతన సంస్కృతికి ప్రతీక.. ఇది మన ఆధ్యాత్మిక ఆత్మకు చిహ్నం.. ఇది భారతదేశ ప్రాచీనతకు, సంప్రదాయాలకు ప్రతీక.. భారతదేశ శక్తి, చలనశీలత.

కాశీకి వచ్చినప్పుడు మీకు విశ్వాసం మాత్రమే కనిపించదు. మీరు ఇక్కడ మీ గత వైభవాన్ని కూడా అనుభవిస్తారు. పురాతనత్వం.. కొత్తదనం ఎలా కలిసి జీవిస్తాయి, ప్రాచీనుల స్ఫూర్తి భవిష్యత్తుకు ఎలా దిశానిర్దేశం చేస్తున్నాయి..? అనేది విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్‌ ద్వారా చూపెడుతున్నాం. గతంలో మూడు వేల చదరపు అడుగులు మాత్రమే ఉన్న ఆలయ విస్తీర్ణం ఇప్పుడు దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోకి మార్చాం. ఇకపై ఆలయానికి, ఆలయ ప్రాంగణానికి 50 నుంచి 75 వేల మంది భక్తులు రావచ్చు. ముందుగా గంగామాత దర్శనం-స్నానం ఆచరించి.. అక్కడి నుంచి నేరుగా విశ్వనాథ్ ధామానికి చేరుకోవచ్చు. 

కాశీలో ఒకే ప్రభుత్వం ఉంది.. అది ఎవరి చేతిలో దమ్ము ఉందో వారి ప్రభుత్వం. ప్రవాహాన్ని మార్చి గంగ ప్రవహించే కాశీని ఎవరు ఆపగలరు?. ఈ అద్భుత నిర్మాణంలో చెమట చిందిస్తున్న ప్రతి కార్మిక సోదర, సోదరీమణులకు ఈ రోజు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో కూడా ఇక్కడ పనులు వేగంగా జరిగాయి. అటువంటి కార్మిక సహోద్యోగులను కలుసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం నాకు ఇప్పుడే లభించింది. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడిన యూపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా నేను అభినందిస్తున్నాను

ఆక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు, దానిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. అందుకు ఔరంగజేబు దురాగతాల చరిత్ర, అతను చేసిన భీభత్సమే సాక్షి. కత్తి యొక్క శక్తితో నాగరికతను మార్చడానికి ప్రయత్నం, మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ దేశ నేల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనది. ప్రతి దాడికి రక్షకుడిని చూపించింది. నేను మీ నుండి మూడు తీర్మానాలను కోరుకుంటున్నాను.. ఇది మన దేశం కోసం. పరిశుభ్రత, సృష్టి స్వావలంబన భారతదేశం కోసం నిరంతరం కొనసాగించాలి’ అని మోదీ పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్