Sonia Gandhi : ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. పలు అంశాలకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలు, ప్రశ్నలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ పరీక్షల్లో మహిళలకు సంబంధించి అడిగిన వివాదాస్పద అంశాన్ని లేవనెత్తిన సోనియా గాంధీ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు.
Sonia Gandhi :పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. పలు అంశాలకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలు, ప్రశ్నలతో విరుచుకుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని కీలకమైన ప్రశ్నలను ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు లోక్‌సభలో కాంగ్రెసు పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. నిప్పులు చెరిగారు. కేంద్ర మానవవనరులశాఖతో పాటు సీబీఎస్ఈని టార్గెట్ చేస్తూ సూటి ప్రశ్నలు సంధిస్తూ.. సభను వేడెక్కించారు. సీబీఎస్ఈ పరీక్షల్లో మహిళల్ని దూషించేలా ఉన్నా ఓ ప్రశ్నపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !
సీబీఎస్ఈ ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలో స్త్రీలను కించపరిచేలా ఉన్న ఓ ప్రశ్న ఇవాళ పార్లమెంటులో లేవనెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సీబీఎస్ఈ తీరును తప్పుబట్టారు. సంబంధిత పరీక్ష నుంచి సీబీఎస్ఈ దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై సవివరంగా వివరణ ఇవ్వాలని సోనియా పేర్కొన్నారు. కాగా, గత శనివారం సీబీఎస్ఈ నిర్వహించిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షలో షాకింగ్లీ రెగ్రెసివ్ పాసేజ్ పేరుతో ఓ పేరా ఇచ్చారు. దీనిలో నుంచి ప్రశ్నల్ని అడిగారు. ఇందులో ఓ ప్రశ్నలో ఇళ్లలో యువతీయువకుల చెడు ప్రవర్తనకు స్త్రీవాద తిరుగుబాట్లు, భార్యలు కుటుంబాల్ని వదిలివెళ్లిపోవడం ఎలా కారణమవుతున్నాయో చెప్పండి అంటూ ప్రశ్నలు అడిగారు. ఈ అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సామావేశాల్లో సోనియా గాంధీ సీబీఎస్ఈ పరీక్ష ప్రశ్నలను ప్రస్తావించారు. లోక్‌సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఈ ప్రశ్న పూర్తిగా సభ్యసమాజం ఖండించదగినదని అన్నారు. అలాంటి కఠోరమైన స్త్రీద్వేషపూరిత విషయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీలను ద్వేషించేలా ఉన్న ఈ ప్రశ్నను సంధిచిన సీబీఎస్ఈ వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. దీనిపై కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖతో పాటు సీబీఎస్ఈ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో విద్యా ప్రమాణాలు ఎంత నాణ్యతలేనివిగా ఉన్నాయో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఎన్సీపీ, డీఎంకే సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీశాయి.
Also Read: America Hurricane:హరికేన్లతో అమెరికాలో అతలాకుతలం.. US చరిత్రలోనే..