దారుణం : కూతురు హత్య కేసులో జైలుకు.. పెరోల్ పై బైటికి వచ్చాక, శిక్ష తప్పించుకోవడానికి కూలీని చంపి..

By SumaBala BukkaFirst Published Dec 13, 2021, 2:37 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన సుదేశ్ తన 13 యేళ్ల daughter హత్య కేసులో 2018లో జైలుకెళ్లాడు. కరోనా తీవ్రరూపంలో ఉన్నప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చాడు. అయితే, త్వరలోనే తన పెరోల్ గడువు ముగిసిపోనుందని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డాడు. ఆ సమయంలో సుదేశ్ మదిలో ఓ వికృత ఆలోచన తట్టింది.  

ఢిల్లీ : కూతురు హత్య కేసులో జైలుకు వెళ్లి Parole మీద బైటికి వచ్చిన ఓ వ్యక్తి మళ్లీ jailకు వెళ్లకూడదని మరో murder చేశాడు. ఓ వ్యక్తిని హతమార్చి.. తానే మరణించినట్లు పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. సదరు నిందితుడితో పాటు అతడికి సహకరించిన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.. అసలేం జరిగిందంటే....

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన సుదేశ్ తన 13 యేళ్ల daughter హత్య కేసులో 2018లో జైలుకెళ్లాడు. కరోనా తీవ్రరూపంలో ఉన్నప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చాడు. అయితే, త్వరలోనే తన పెరోల్ గడువు ముగిసిపోనుందని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డాడు. దీనికోసం ఏం చేయాలా? శిక్షను ఎలా తప్పించుకోవాలా? జైలుకు వెళ్లకుండా ఎలా ఉండాలా? అని తీవ్రంగా ఆలోచించాడు. ఆ సమయంలో సుదేశ్ మదిలో ఓ వికృత ఆలోచన తట్టింది. 

తను చనిపోతే.. శిక్ష, జైలు నుంచి తప్పించుకోవచ్చు కదా.. అని ఆలోచించాడు. అయితే తాను నిజంగా చనిపోతే ఎలా.. అందుకే ఓ దారుణమైన పథకానికి ప్లాన్ వేశాడు. ఓ వ్యక్తిని హతమార్చి.. అది తన మృతదేం అని పోలీసులను పక్కదారి పట్టించాలని భావించాడు. ఈ విషయాన్ని భార్యకు వివరించాడు. భర్త తప్పుదోవ పడుతుంటే వద్దని వారించాల్సిన భార్య.. దానికి విరుద్ధంగా..భర్త ప్లాన్ కు సహకరించింది.

మైనర్ కూతురి మీద కన్నతండ్రి అత్యాచారం.. ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిల్.. బీహార్ లో హేయమైన ఘటన...

అలా భార్య సహకరించడంతో.. తన ప్లాన్ ను అమలు చేసేందుకు.. తన ఇంటికి సమీపంలో నివసించే ఓ కూలీని గత నవంబర్ 20న లోనీ ప్రాంతానికి సుదేశ్ పిలిపించకున్నాడు. అక్కడే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అతనికి ప్లాన్ ప్రకారం బాగా మద్య తాగించాడు. తరువాత సదరు కూలీ మత్తులోకి జారుకున్నాక అతడి తలపై కర్రతో పలుమార్లు బాది హతమార్చాడు. 

అనంతరం అతడి ముఖాన్ని గుర్తుపట్టకుండా కాల్చేశాడు. మృతుడి జేబులో తన Aadhaar cardను పెట్టి.. మృతదేహాన్ని అక్కడే వదిలేసి సుదేశ్ పరారయ్యాడు. అక్కడికి చేరుకుని పరిశీలించగా అతడి జేబులో ఆ ఆధార్ కార్డు లభించింది. దీంతో Sudesh భార్యను పిలిపించి విచారించగా.. అది తన భర్త మృతదేహమేనని ఆమె వెల్లడించింది. 

Miss Universe 2021 : భారత సుందరి హర్నాజ్ సంధుదే కిరీటం..!

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యపై విచారణ జరుపుతున్నారు. అయితే సుదేశ్ చనిపోలేదని, అతను బతికే ఉన్నాడని పోలీసులకు తాజాగా సమాచారం అందింది. దీంతో అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రశ్నించగా.. తాను చేసిన నిర్వాకాన్ని వెల్లడించాడు.

అతడికి సహకరించిన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, తన భర్త కనిపించడం లేదంటూ సదరు కూలీ భార్య చేసిన ఫిర్యాదు ఆధారంగా.. మృతదేహాన్ని వారికి చూపించడంతో కూలీ కుటుంబసభ్యులు శోకంలో మునిగిపోయారు. 

click me!