దేశంలోని పలు రాష్ట్రాల్లో 10 వందే భారత్ కొత్త రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో 10 వందే భారత్ కొత్త రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ప్రారంభించారు.గుజరాత్ రాష్ట్రంలోని అహ్మాదాబాద్ ఇవాళ మోడీ పర్యటించారు. అహ్మాదాబాద్ నుండి మోడీ వర్చువల్ గా ఈ రైళ్లను ప్రారంభించారు.
also read:40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్
నాగ్‌పూర్-పాట్నా, పాట్నా-లక్నో, లక్నో- డెహ్రాడూన్, పూరి- విశాఖపట్టణం, కలబుర్గి-బెంగుళూరు, రాంచీ-వారణాసి, ఖజురహో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై, సికింద్రాబాద్-విశాఖపట్టణం, మైసూర్-చెన్నై మధ్య కొత్త వందేభారత్ రైళ్లను మోడీ ప్రారంభించారు.ఈ కొత్త రైళ్లతో దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్య 50కి చేరాయి.
also read:పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి,పది మందికి గాయాలు
ప్రస్తుతం ఉన్న నాలుగు వందేభారత్ రైళ్ల మార్గాలను పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అజ్మీర్ -ఢిల్లీ వందేభారత్ రైలును ఛండీఘడ్ వరకు పొడిగించారు. అహ్మదాబాద్ - జామ్ నగర్ రైలును ద్వారకా వరకు పొడిగించారు. గోరఖ్ పూర్ -లక్నో రైలును ప్రయాగ్ రాజ్ వరకు పొడిగించారు. తిరువనంతపురం- కాసరగోడ్ రైలును మంగళూరు వరకు పొడిగించారు.
also read:పరీక్షలో పాస్ చేయండి లేకపోతే పెళ్లి చేస్తారు: ఆన్సర్ షీట్ లో ఓ విద్యార్ధిని వేడుకోలు
2023 డిసెంబర్ లో ఆరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టారు. కత్రా-న్యూఢిల్లీ, అమృత్ సర్- ఢిల్లీ, కోయంబత్తూరు-బెంగుళూరు, మంగళూరు-మడ్ గావ్, జల్నా-ముంబై, అయోధ్య-ఢిల్లీ, ఢిల్లీ-వారణాసి మార్గంలో వందేభారత్ రైళ్లను ప్రవేశ పెట్టారు.
దేశాభివృద్దిలో రైల్వేల పాత్ర కీలకం: మోడీ
విక్షిత్ భారత్ కోసం సంస్కరణలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి ప్రాంతంలో అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2024 ప్రారంభమై 75 రోజులు గడిచింది. ఇప్పటికే 11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను చేర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైల్వే అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తాను రైల్వే ట్రాక్ లపై తన జీవితాన్ని ప్రారంభించినట్టుగా చెప్పారు. రైల్వేలు ఇంతకు ముందు ఎంత అధ్వాన్నంగా ఉండేవో తెలుసునన్నారు.
also read:టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల షేరింగ్‌లో స్వల్పమార్పులు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్ధానికి ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. భారత దేశంలో యువత ఎక్కువగా ఉందన్నారు. ఇవాళ జరిగినప్రారంభోత్సవాలు మీ వర్తమానం కోసమేనన్నారు. గత 10 ఏళ్లలో రైల్వేల అభివృద్దిలో గతంలో ఖర్చు చేసిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా మోడీ పేర్కొన్నారు.
అభివృద్ది చెందిన, ఆర్ధికశక్తిగా మారిన దేశాల్లో రైల్వేలు కీలక పాత్ర పోషించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి సంకల్ప శక్తిని చూపిందని మోడీ చెప్పారు.