40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

By narsimha lode  |  First Published Mar 12, 2024, 8:54 AM IST

చిన్ననాటి స్నేహితులు  40 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


న్యూఢిల్లీ: చిన్ననాటి స్నేహితులు  విడిపోయారు. ఏళ్ల తర్వాత కలిశారు. భారత్,పాకిస్తాన్ విభజనతో ఈ ఇద్దరు స్నేహితులు విడిపోయారు.  అయితే  చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సురేష్ కొఠారి,   ఏజీ షకీర్ మంచి స్నేహితులు. 2023 అక్టోబర్ మాసంలో వీరిద్దరూ కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి,పది మందికి గాయాలు

Latest Videos

undefined

గుజరాత్ రాష్ట్రంలోని దీసాలో సురేష్, ఏజీ షకీర్ లు పెరిగారు.వీరిద్దరికి 12 ఏళ్ల వయస్సున్న సమయంలో  భారత్, పాకిస్తాన్ విభజన జరిగింది.   ఏజీ షకీర్ కుటుంబం పాకిస్తాన్ కు వెళ్లింది.  పాకిస్తాన్ లోని రావల్పిండిలో షకీర్ కుటుంబం స్థిరపడింది. తమ కుటుంబ చిరునామాను  కూడ షకీర్  సురేష్ కు పంపారు.

also read:పరీక్షలో పాస్ చేయండి లేకపోతే పెళ్లి చేస్తారు: ఆన్సర్ షీట్ లో ఓ విద్యార్ధిని వేడుకోలు

వీరిద్దరూ  ఏళ్ల తరబడి కలుసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే రెండు దేశాల మధ్య  నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కలుసుకొనేందుకు వీలు కాలేదు. 1947 నుండి 1981 వరకు  వీరిద్దరు కలుసుకోలేదు. అయితే  1982లో న్యూయార్క్ లో  కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు.

also read:టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల షేరింగ్‌లో స్వల్పమార్పులు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

2023 అక్టోబర్ లో  మరోసారి వీళ్లిద్దరూ కలిశారు. 41 ఏళ్ల తర్వాత మరోసారి వీరిద్దరూ కలిశారు.  40 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా వీరిద్దరూ  వేర్వేరు దేశాల్లో నివసిస్తున్నప్పటికీ  తమ మధ్య ప్రేమ తగ్గలేదని  నిరూపించారు.సురేష్ 90వ పుట్టిన రోజున మరోసారి వీరిద్దరూ కలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.సురేష్ మనమరాలు  వీరిద్దరిని కలిపేందుకు ప్రయత్నించింది.ఇందుకు సంబంధించిన వీడియోలను  కూడ ఆమె పోస్టు చేశారు.

 

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.  మేం అన్నదమ్ములం.. రాజకీయ ద్వేషం మమ్మల్ని విభజించవద్దని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.యుగాలలో తాను చూసిన అత్యంత అద్బుతమైన విషయంగా  మరొకరు వ్యాఖ్యానించారు. తాను చాల సంతోషంగా ఉన్నాను.. తన స్నేహితుడి వద్దకు వెళ్లిన అనుభూతి కలిగిందని మరొకరు పేర్కొన్నారు.ఈ అద్భుతమైన క్షణాలను తమతో పంచుకున్నందుకు ధన్యవాదాలంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.  దేవుడు వారిద్దరిని ఆశీర్వదిస్తాడన్నారు.

click me!