ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఇవాళ అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారంనాడు అరుణాచల్ ప్రదేశ్ లోని అతి పొడవైన సెలా టన్నెల్ ను ప్రారంభించారు.ఇవాళ ఉదయం అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు మోడీ.
also read:అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ: పొత్తు చర్చలు
శుక్రవారం నాడు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అసోం చేరుకున్నారు. ఇవాళ ఉదయం కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఈ పార్క్ లో జీపులో తిరిగారు.అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో విక్షిత్ భారత్ విక్షిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలోనే అతి పొడవైన సెలా టన్నెల్ ను మోడీ జాతికి అంకితం చేశారు.
also read:చైనా సరిహద్దుల్లో రెండు పినాకా రిజిమెంట్లు: మోహరించనున్న భారత్
అరుణాచల్ ప్రదేశ్ లోని సెలా పాస్ మీదుగా తవాంగ్ కు ఈ టన్నెల్ కనెక్టివిటీని అందిస్తుంది. రూ. 825 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్ ను నిర్మించారు.2019లో ప్రధానమంత్రి మోడీ దీనికి శంకుస్థాపన చేశారు.ఈ సొరంగం దేశానికి వ్యూహత్మకంగా ముఖ్యమైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ది చెందకుండా ఉంచాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని మోడీ ఆరోపించారు. సేల సొరంగాన్ని ఇప్పటికే నిర్మించాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని మోడీ విమర్శలు గుప్పించారు.
ఉన్నతి పథకాన్ని మోడీ ప్రారంభించారు. రూ. 10 వేల కోట్లతో ఈ పథకం చేపట్టారు. మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 55,600 కోట్ల విలువైన పనులను మోడీ జాతికి అంకితం చేశారు.
also read:కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)
ఇవాళ మధ్యాహ్నం జోర్హాట్ లో లెజెండరీ అహోమ్ జనరల్ అచిత్ బర్పుకాన్ 125 అడుగుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్ వాలర్ ను మోడీ ఆవిష్కరిస్తారు.అరుణాచల్ నుండి పశ్చిమ బెంగాల్ లోని సిలిగురికి వెళ్లి సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ లో రూ. 4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ జాతికి అంకితం చేస్తారు.
also read:అసోంలో మోడీ టూర్: కజిరంగ నేషనల్ పార్క్‌లో ఏనుగు సవారీ చేసిన ప్రధాని (వీడియో)
ఇవాళ రాత్రికి వారణాసికి చేరుకుంటారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.మరునాడు వారణాసిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రూ. 42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.