మరిది పెళ్లికి వదిన చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
న్యూఢిల్లీ: వివాహ వేడుకలు, ఇతర ఫంక్షన్ల సందర్భంగా చేస్తున్న డ్యాన్స్ లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరిది పెళ్లికి సినిమా పాటకు వదిన చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియో వందలాది మంది వీక్షించారు. ఈ వీడియోపై ఇంటర్నెట్ లో జోరుగా చర్చ సాగుతుంది.
also read:అసోంలో మోడీ టూర్: కజిరంగ నేషనల్ పార్క్‌లో ఏనుగు సవారీ చేసిన ప్రధాని (వీడియో)
హమ్ ఆప్ కే హై కౌన్ హిందీ సినిమాలోని చలీ మైన్ అనే పాటకు నీలిరంగు దుస్తులు ధరించిన వదిన చేసిన డ్యాన్స్ నెటిజన్లను కట్టిపడేసింది. బ్రౌన్ షేర్వానీలో గుర్రంపై వరుడు ఉన్నట్టుగా వీడియోలో కన్పించింది. గుర్రంపై ఉన్న వరుడు కూడ ఈ పాటలో డ్యాన్స్ చేస్తున్న వారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.
also read:టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు?: సీట్ల సర్దుబాటుపై చర్చలు
ఈ వీడియోను షేర్ చేయాలని క్యాప్షన్ తో ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో పోస్టు చేసిన తర్వాత మూడు మిలియన్లకు పైగా మంది వీక్షించారు. ఏడువేలకు పైగా మంది ఈ వీడియోను లైక్ చేశారు.
సంతోషంతో నిండిన కుటుంబం... ప్రేమించండి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఈ డ్యాన్స్ బాగుందని మరో నెటిజన్ చెప్పారు.ఈ వీడియోను కొందరు తమ అభిమానించే కుటుంబ సభ్యులకు ట్యాగ్ చేశారు.భవిష్యత్తులో తమ ఇళ్లలో జరిగే వివాహ వేడుకల్లో ఇలా డ్యాన్స్ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.