India Pakistan war : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు కనిపిస్తే జాగ్రత్త.. ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి

Published : May 09, 2025, 11:18 AM IST
India Pakistan war : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు కనిపిస్తే జాగ్రత్త.. ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి

సారాంశం

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశపౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సూచించింది. సోషల్ మీడియ ాను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని... ఏదయినా అనుమానాస్పద పోస్ట్ చూస్తే వెంటనే పిఐబికి సమాచారం ఇవ్వాలని సూచించారు. 

India Pakistan War : పాక్ ప్రేరిత తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో విస్తరిస్తోందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆందోళన వ్యక్తం చేసింది. పిఐబి అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం 'PIB Fact Check' భారత నెటిజన్స్ కి కీలక హెచ్చరికలు జారీచేసింది. ఇకపై ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో నకిలీ సమాచార ప్రవాహం పెరుగుతోందని పేర్కొంది. ముఖ్యంగా భారత సాయుధ దళాలు మరియు ప్రస్తుతం కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్ పరిస్థితులకు సంబంధించి వస్తున్న సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఐబి సూచించింది.

పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ హ్యాండిల్‌ ద్వారా కీలక ప్రకటన విడుదల చేసింది. "రానున్న రోజుల్లో మీ సోషల్ మీడియాలో పాకిస్థాన్ కు అనుకూల లేదా ప్రేరేపిత సమాచారంతో  నిండిపోతుంది. కాబట్టి ప్రతి సమాచారం పట్ల శ్రద్ధ వహించాలి.. భారత వ్యతిరేక వార్తలను షేర్ చేయకండి. ఏదయినా సందేహాస్పద విషయాలు కనిపిస్తే 'PIB Fact Check'కి పంపండి" అని తెలిపింది. ఇలా సోషల్ మీడియాలో అనుమానాస్పదంగా కనిపించే కంటెంట్ లేదా పోస్టులను పంపేందుకు అధికారిక వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా మెయిల్ ఐడీ (factcheck@pib.gov.in)(mailto:factcheck@pib.gov.in)ని ఉపయోగించాలని సూచించింది.

ఈ ఆపరేషన్ తర్వాత భారత-పాక్ మధ్య యుద్దవాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు నకిలీ ప్రచారాలను నమ్మి ఇతరులకు షేర్ చేసి ఇబ్బంది పడవద్దని పిఐబి సూచించింది. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలావుంటే ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత ఇండియా-పాకిస్థాన్ యుద్ద పరిస్థితులకు దేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. భారత ప్రభుత్వానికి, త్రివిద దళాలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా భారత ఆర్మీకి సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. ఇలా ఆర్మీ మనోధైర్యాన్ని పెంచే పోస్టులను మాత్రమే షేర్ చేయాలని... దెబ్బతీసే వాటిపై మాత్రం పిఐబికి సమాచారం ఇవ్వాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !