India Pakistan War: చండీగఢ్‌లో ఎయిర్ రెయిడ్ అలర్ట్.. !

Published : May 09, 2025, 10:26 AM ISTUpdated : May 09, 2025, 10:27 AM IST
India Pakistan War: చండీగఢ్‌లో ఎయిర్ రెయిడ్ అలర్ట్.. !

సారాంశం

పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో చండీగఢ్, మొహాలి నగరాల్లో ఎయిర్ రెయిడ్ అలర్ట్; ప్రజలను ఇళ్లలోనే  ఉండమని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

చండీగఢ్ నగరంలో శుక్రవారం ఉదయం వాయు దాడి హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్ సైరన్లు మోగించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి "దాడి అవకాశముంది" అన్న సమాచారంతో వెంటనే జిల్లా అధికారులు సైరన్లను మోగించి హెచ్చరికలు జారీ చేశారు.చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఇంట్లోనే ఉండాలని, బాల్కనీల్లోకి రావద్దని సూచించింది. ఈ పరిణామం తర్వాత పంజాబ్‌లోని మోహాలీ జిల్లా అధికారులు కూడా తమ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అదే సూచన చేశారు. మోహాలీలోని సెక్టార్‌లలో కూడా అలర్ట్ ప్రకటించడంతో అక్కడి జనంలోనూ గందరగోళం నెలకొంది.

గగనంలోనే తునాతునకలు..

గత రాత్రి పాకిస్తాన్ దాడులు. పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులతో ఆకస్మికంగా దాడికి దిగింది. ఈ దాడుల్లో 50కు పైగా డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మధ్య గగనంలోనే తునాతునకలు చేసింది.దాడులకు భారత ఆర్మీ తక్షణమే ప్రతీకారం తీర్చింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ నగరాల్లో భారత దళాలు కౌంటర్ స్ట్రైక్ చేపట్టాయి. పైగా, పాకిస్తాన్ పరిమితిని దాటి, సీవ్‌ఫైర్ ఉల్లంఘించి, ఎల్ఓసీ వెంబడి ఉన్న గ్రామాలపై ఆర్టిల్లరీ షెల్లింగ్‌కు కూడా పాల్పడింది. దీనికి భారత సైన్యం సమర్ధంగా ప్రతిస్పందించింది.

ఈ పరిణామాల వల్ల చండీగఢ్ వంటి పెద్ద నగరాల్లో కూడా హెచ్చరికలు జారీ కావడం, ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితిపై కేంద్రం, రక్షణ విభాగాలు నిఘా ఉంచి ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?