రేపటినుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు: అఖిలపక్ష సమావేశం ప్రారంభం

By telugu teamFirst Published Nov 17, 2019, 12:50 PM IST
Highlights

రేపటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ఆదివారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ప్రారంభమైంది. 

న్యూఢిల్లీ : రేపటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ఆదివారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ప్రారంభమైంది. 

సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులంతా సహరించాలని అభ్యర్థించేందుకు ఈ అఖిలపక్ష సమావేశాన్ని మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేశారు.

Also read: స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం: టిఆర్ఎస్ నుంచి నామా, వైసిపి నుంచి మిథున్ రెడ్డి
 
బీజేపీ నుండి హోం మంత్రి అమిత్ షా, థావర్‌చంద్ గెహ్లాట్, వి.మురళీధరన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ లు హాజరయ్యారు.  టీడీపీ నుండి గల్లా జయదేవ్ హాజరవ్వగా, కాంగ్రెస్ నుండి గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి వచ్చారు. వైసీపీ నుండి ఎంపీ విజయసాయి రెడ్డి హాజరయ్యారు. 

బీఎస్‌పీ నుండి ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ మిశ్రా హాజరవ్వగా,  టీఎంసీ నుండి ఎంపీలు డెరిక్ ఓబ్రెయిన్, సుధీప్ బందోపాధ్యాయ్ వచ్చారు.  ఎల్‌జేపీ నుండి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ హాజరయ్యారు.  

ఆర్‌పీఐ నుండి ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే హాజరయ్యారు.  అన్నాడీఎంకే నుండి ఆ పార్టీ ఎంపీ నవనీ త్ కృష్ణన్ హాజరవ్వగా, అప్నాదళ్ నుండి ఆ పార్టీ ఏకైక  ఎంపీ అనుప్రియ పటేల్ వచ్చారు. 

ఎండీఎంకే పార్టీ నుండి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ వైగో పాల్గొన్నారు.  సీపీఎం నుండి ఆ పార్టీ సీనియర్ నేత టీకే రంగరాజన్ హాజరవ్వగా, డీఎంకే నుండి ఆ పార్టీ నేత టీఆర్ బాలు పాల్గొన్నారు. 

Also read: Ayodhya verdict: తదుపరి అడుగులు ఉమ్మడి పౌర స్మృతి వైపేనా?

ఆర్జేడీ నుండి ఆ పార్టీ సీనియర్ నేత మనోజ్ ఝా పాల్గొన్నారు. సమాజ్ వాది పార్టీ నుండి సీనియర్ లీడర్ రామ్‌గోపాల్ యాదవ్ తదితరులు నేటి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం నిన్న శనివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యులంతా సభాకార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరైనా విషయం తెలిసిందే.  

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుండి ప్రారంభమయ్యి డిసెంబర్ 13 వరకు జరుగనున్నాయి.

త సమావేశాల్లో పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు తో తీవ్ర దుమారం రెజినా విషయం తెలిసిందే. ఈ సారి శీతాకాల సమావేశాల్లో కూడా ఏదైనా ఒక వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టె ఆస్కారం ఉంది. 

ఉమ్మడి పౌర స్మృతిని కేంద్ర సర్కార్ ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే ఆస్కారముందని తెలుస్తుంది. ఏదేమైనా, దేశ పాలనను చేపట్టిన తరువాత, ప్రధానమంత్రి ఎప్పుడూ  వన్ ఇండియా అనే మాట్లాడుతూ ఉంటారు.  నిత్యం  సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. 

మొన్నటి అయోధ్య తీర్పు కూడా మోడీ అనుకూల పవనాలు దేశమంతటా బలంగా వీచేలా చేసింది. తీర్పు వెలువడిన కొన్ని గంటల తరువాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ,  "నవంబర్ 9, నేటితో కక్ష, ఈర్షా ద్వేషాలకు చరమగీతం పాడుదాం" అని అన్నారు. ప్రస్తుత భారతదేశంలో భయానికి, కోపతాపాలకు,నెగటివిటీకి చోటులేదన్నారు.   

ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో, బిజెపి ప్రభుత్వం తన అజెండాలోని అన్ని హిందుత్వ వాగ్ధానాలను దాదాపుగా పూర్తి చేసింది - ఆర్టికల్ 370, ఎన్‌ఆర్‌సిని రద్దు చేయడం. 

"యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)" మాత్రమే మిగిలి ఉన్న ప్రధాన సమస్య. రానున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఈ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన  బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆస్కారమే లేకపోలేదు. లోక్ సభలో బ్రహ్మాండమైన మెజారిటీ వారి సొంతం. రాజ్యసభలో కూడా పావులు కదపడం ద్వారా వారికి కావలిసిన చట్టాలను సునాయాసంగా పాస్ చేయించుకుంటున్నారు. 

ఉమ్మడి పౌర స్మృతి విషయంలో బీజేపీ ఎప్పటినుంచో తన వైఖరిని బహిరంగంగానే ప్రకటించింది. ఎన్నికల మానిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనీ పేర్కొన్నారు. కాబట్టి ఇదేదో హిందుత్వ వాదం కోసం బీజేపీ తీసుకుంటున్న చర్య అనే కన్నా రాజ్యాంగంలో ఉన్న ఒక ఆదేశిక సూత్రానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. 

Also read: ayodhya verdict: అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం.. వారికి కోర్టు ప్రశంసలు

ఇప్పటికే ట్రిపుల్ తలాక్ అంశంలో అది చెల్లుబాటు కాకుండా చట్టం తీసుకువచ్చింది. తద్వారా సివిల్ చట్టంలో ఒక ముఖ్య అంశమైన పెళ్లిని మామూలు చట్ట పరిధి కిందికి తీసుకొని వచ్చారు. ఈ చట్టం లోని లోటుపాట్లను పక్కన పెడితే ఈ చట్టాన్ని ముస్లిం మహిళలు కూడా ఆహ్వానించారు. కారణం- ఈ డిమాండ్ ముస్లిం మహిళాల్లోంచి బయటికి వచ్చింది. 

click me!