స్వతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం సిద్ధమవుతున్న సమయంలో మహారాష్ట్రలోని పూణెలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అనే నినాదాలు కలకలం రేకెత్తించాయి. పోలీసులకు ఈ విషయం తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
దేశం మొత్తం మంగళవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఎక్కడ చూసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. దేశం నలుమూలల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. అయితే మహారాష్ట్రలోని పూణెలో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పొరుగుదేశాన్ని పొగుడుతూ పలువురు నినాదాలు చేశారు. కొంధ్వా ప్రాంతంలో సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు యువకులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించారు. ఈ ఘటనపై కొంధ్వా పోలీసులు కేసు నమోదు చేశారు.
కొంధ్వా ప్రాంతంలోని ఓ పాఠశాల నిర్మాణ స్థలంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న కొందరు పౌరులు ఈ నినాదాలు విని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
దారుణం.. భార్యకు విడాకులిచ్చి తనతో ఉంటాడని ప్రియుడి కుమారుడిని చంపిన ప్రియురాలు..
undefined
దీనిపై పుణె నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘టైమ్స్ నౌ’తో మాట్లాడుతూ.. ‘‘ సోమవారం (ఆగస్టు 14) సాయంత్రం లక్ష్మీనగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల స్థలం నుంచి 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు వినిపించాయని స్థానికుల నుంచి మాకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనాస్థలికి ఒక బృందాన్ని పంపించి, దర్యాప్తు చేపట్టాం. అందులో ఇద్దరు నిందితులు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసినట్లు తేలింది. వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం.’’ అని తెలిపారు.
కాగా.. ఇద్దరు నిందితులను అక్బర్ నదాఫ్, తౌకిర్ గా పోలీసులు గుర్తించారు. ఇందులో తౌకిర్ బింతాడే నిర్మాణ స్థలంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, మరో వ్యక్తి అక్బర్ నదాఫ్ కొంధ్వాలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద కేసు నమోదు చేశారు.