ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసంచేసిన ప్రతిజ్ఞ అని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు. పాక్ లోని ఉగ్రస్థావారాలపై మన సైన్యం దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టిందని మోదీ చెప్పుకొచ్చారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు కాదని కోట్లాది మంది భారత ప్రజల భావోద్వేగానికి ప్రతి రూపం అని మోదీ అన్నారు. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలందరి తరఫున భారత సైన్యానికి మోదీ అభినందనలు తెలియజేశారు. పాకిస్థాన్‌కు పీవోకేను వదలడం తప్ప మరో మార్గం లేదని స్పస్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మన బలగాలకు నా సెల్యూట్ అని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో సాహసోపేతమన ప్రదర్శన చేశారన్నారు. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు.