india Pakistan : అలాగైతే భారత్ తో యుద్దమే : పాక్ విదేశాంగ మంత్రి రెచ్చగొట్టే మాటలు

Published : May 13, 2025, 02:22 PM IST
india Pakistan :  అలాగైతే భారత్ తో యుద్దమే :  పాక్ విదేశాంగ మంత్రి రెచ్చగొట్టే మాటలు

సారాంశం

భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. ఈ క్రమంలో పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాన్ దార్ భారత్ ను కవ్వించేలా మాట్లాడారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే...     

India Pakistan : కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించడంతో భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. కొద్దిరోజులుగా నెలకొన్న యుద్దవాతావరణం చల్లబడుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ కవ్వించేలా కామెంట్స్ చేసారు. ఇరుదేశాల మధ్య నీటి వివాదం పరిష్కారం కాకపోతే దీన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని   ఇషాక్ దార్ బెదిరించారు.

సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశం యొక్క ప్రతీకార దాడులను యుద్ధంగా దార్ వర్ణించారు. రెండు దేశాల మధ్య చర్చలు ఇంకా పూర్తి కాలేవని పేర్కొన్నారు.  యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారతదేశం పోరాటాన్ని ఆపడానికి సిద్ధంగా ఉందనే సందేశాన్ని అందించారు. ఈ సమయంలోనే సింధు జలాల ఒప్పందం రద్దు చేసి నీటిని  ఆపితే దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెప్పినట్లు దార్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారని ఈ సందర్భంగా దార్ పేర్కొన్నారు. 

 

1960లో ప్రపంచ బ్యాంకు సహాయంతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తొమ్మిదేళ్ల చర్చల తర్వాత సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. ఈ ఒప్పందం పశ్చిమ నదులను (సింధు, జీలం, చీనాబ్) పాకిస్థాన్‌కు... తూర్పు నదులను (రావి, బియాస్, సట్లెజ్) భారతదేశానికి కేటాయిస్తుందన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వా భారతదేశం ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది... చీనాబ్ నదిపై బాగ్లిహార్ ఆనకట్ట నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేసిందని ఇషాన్ దార్ తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారతదేశం దాడులు చేసింది. పాకిస్థాన్ వరుసగా రెచ్చగొట్టే చర్యలతో ముందుకు వచ్చింది, వీటిని భారతదేశం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?