మిమ్మల్ని చూసి యావత్ దేశమే గర్విస్తోంది : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై మోదీ ప్రశంసలు

Published : May 13, 2025, 01:54 PM IST
మిమ్మల్ని చూసి యావత్ దేశమే గర్విస్తోంది : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై మోదీ ప్రశంసలు

సారాంశం

జలంధర్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పిఎం మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్, ఇతర ఉద్యోగులతో మాట్టాడారు. ఆపరేషన్ సిందూర్ లో కీలకంగా వ్యవహరించిన ఐఎఎఫ్ సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపేలా ప్రధాని మోదీ పర్యటన ఉంది. 

Narendra Modi: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యుద్దవాతావరణం చల్లబడింది.అయితే పాక్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోడమే కాదు ప్రతిదాడుల సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకంగా వ్యవహరించింది. దీంతో అద్భుతంగా పోరాడిన ఎయిర్ ఫోర్స్ ను అభినందించేందుకు ప్రధాని మోదీ పంజాబ్ లో ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు... వైమానిక యోధులతో సంభాషించారు.

జలంధర్ లోని ఎయిర్ బేస్ కు విచ్చేసిన ప్రధాని మోదీకి ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత పరిణామాల్లో ఐఎఎఫ్ ఎలా వ్యవహరించిందో వైమానిక దళ సిబ్బంది పిఎం మోదీకి బ్రీఫింగ్ ఇచ్చారు.

 

"ఈ ఉదయం నేను AFS ఆదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను, సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయత్వానికి ప్రతీకలుగా నిలిచిన వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి. మన దేశం కోసం వారు చేసే ప్రతిదానికీ భారతదేశం వారికి శాశ్వతంగా కృతజ్ఞతలు" అని పిఎం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 




ఆపరేషన్ సిందూర్ సమయంలో చురుగ్గా పనిచేసిన వైమానిక స్థావరాలలో ఆదంపూర్ ఒకటి. సోమవారం DG ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ ఉద్దేశ్యం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడమే కానీ పాకిస్తాన్ సైన్యం లేదా పాకిస్తాన్ పౌరులతో కాదని అన్నారు.

ఒక ప్రెస్ బ్రీఫింగ్‌లో ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ... “మా పోరాటం ఉగ్రవాదులతో, మా పోరాటం పాకిస్తాన్ సైన్యం లేదా పాకిస్తాన్ పౌరులతో కాదు, కాబట్టి అది చాలా స్పష్టంగా ఉంది. మేము మా లక్ష్యంలో చాలా స్పష్టంగా ఉన్నాము” అని తెలిపారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో ఖచ్చితమైన దాడుల ద్వారా భారత సాయుధ దళాలు తమ బలాన్ని ప్రదర్శించాయని ఎయిర్ మార్షల్ నొక్కి చెప్పారు. “మా కౌంటర్ వ్యవస్థలు, శిక్షణ పొందిన వైమానిక రక్షణ ఆపరేటర్లు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నారు, మన దేశీయ సామర్థ్యం దాని ప్రభావాన్ని నిరూపించుకుంది. ఏ రకమైన సాంకేతికత వచ్చినా దానిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిరూపించబడింది. ఎక్కువ మాటలు అక్కర్లేదు, మేము ఏం చేసామో మీరు మీ కళ్ళారా చూశారు” అని  అన్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu