
Pahalgam Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఇప్పటికే భద్రతాదళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు. ఇందులో ఇద్దరు పాకిస్థానీయులు, ఓ కశ్మీరీ ఉన్నట్లు గుర్తించారు. వీరి ఆఛూకీ తెలిపినవారికి భారీగా నగదు రివార్డు ప్రకటించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను పోలీసులు విడుదల చేశారు. వీరి ఆఛూకీ తెలిపితే 20 లక్షల రూపాయల చొప్పున బహుమతి ప్రకటించారు. వీరి గురించి సమాచారం ఇచ్చినవారికి, అరెస్టుకు సహకరించినవారికి బహుమతి ఇస్తామని అనంతనాగ్ పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురూ లష్కరే తోయిబాకు చెందినవారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
స్కెచ్‌లలో గుర్తించిన ఉగ్రవాదులు:
మంగళవారం పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో ఈ దాడి జరిగింది. పర్యాటకులతో నిండివున్న వ్యాలీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించిందPahalgam Terrorist Attack ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) అత్యవసర సమావేశంలో పాకిస్థాన్‌పై 5 కఠిన చర్యలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేశారు. అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేశారు. SAARC వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీయులకు భారత్ ప్రవేశాన్ని నిషేధించారు. పాక్ హైకమిషన్ రక్షణ సలహాదారుడిని 'Persona Non Grata'గా ప్రకటించారు. హైకమిషన్ సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించనున్నారు (మే 1 నాటికి).
గురువారం ఉదయం ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’, ‘ఉగ్రవాదంపై చర్యలు తీసుకోండి’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి నిరసనకారులను శాంతింపజేశారు.