కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... కేవలం హిందూ పర్యాటకులే టార్గెట్, 24 మంది మృతి

దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో కనీసం 24 మంది హిందూ పర్యాటకులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. బాధితుల మత గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. 

Pahalgam Terror Attack: 24 Hindu Tourists Killed in Kashmir in telugu akp

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. పహల్గాం సమీపంలోని బైసరన్ మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో కనీసం 24 మంది హిందూ పర్యాటకులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.  

తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బాధితుల్లో ఉన్నారు.గుర్తింపు కార్డులు, దుస్తులను చూసి మత గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంటే కేవలం హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

| Anantnag, J&K | A tourist couple from Maharashtra's Nagpur who were present at the spot of the terrorist attack on tourists in Pahalgam, say, "This incident happened when we had just left the place of the incident. We could hear the sound of firing for a long time.… pic.twitter.com/yXF3JLnSMz

— ANI (@ANI)

Latest Videos

 

ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. పర్యాటకులతో రద్దీగా ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకున్న ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వివాదాస్పద ప్రాంతంలో భారత పాలనను వ్యతిరేకించే ఉగ్రవాదులే దీనికి పాల్పడ్డారని అధికారులు ఆరోపించారు. పర్యాటకుల కోసం 24/7 అత్యవసర హెల్ప్ డెస్క్‌ను అనంతనాగ్ పోలీసులు ఏర్పాటు చేశారు.

ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం దృఢంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.

I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.

Those behind this heinous act will be brought…

— Narendra Modi (@narendramodi)

ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి రంగంలోకి దిగారు. ఆయన భద్రతాదళాలకు చెందిన అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని దాడి ప్రదేశానికి ఆయన బయలుదేరారు.

| J&K | Union Home Minister Amit Shah reaches Srinagar to hold a high-level meeting in the wake of the terrorist attack on tourists in Pahalgam. CM Omar Abdullah receives him at the airport. pic.twitter.com/5KBhhUZ91W

— ANI (@ANI)

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి శ్రీనగర్‌కు బయలుదేరారు. ఉగ్రదాడిని ఖండిస్తూ, ఉగ్రవాదులను నిర్మూలించేందుకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రారంభించినట్లు సిన్హా ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.  "దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది. మన దళాల రక్తం ఉడికిపోతోంది. పహల్గాం దాడికి పాల్పడిన వారికి చాలా పెద్ద ధర చెల్లించుకోవాల్సి వస్తుందని దేశానికి హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని ఆయన పేర్కొన్నారు

ఇప్పటికే భద్రతా దళాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నాయి.ఈ విషాదకర సంఘటన ఈ ప్రాంతంలో ఉగ్రవాద ముప్పును, పౌరులను రక్షించడానికి, శాంతిని కాపాడటానికి నిరంతర అప్రమత్తత, భద్రతా చర్యల అవసరాన్ని నొక్కి చెబుతోంది.

vuukle one pixel image
click me!