Corona Vaccination: తొలిరోజే రికార్డు స్థాయిలో టీనేజర్ల‌కు వ్యాక్సినేష‌న్

By Rajesh KFirst Published Jan 4, 2022, 2:51 AM IST
Highlights

Corona Vaccination:  దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రప్ర‌భుత్వం సోమ‌వారం ప్రారంభించింది. ప్రారంభించిన తొలి రోజే.. వ్యాక్సినేష‌న్ కు రికార్డు స్థాయిలో టీకా వేయించుకున్నారు. సోమ‌వారం రాత్రి 8 గంటల సమయానికి, 15-18 సంవత్సరాల వయస్సు గల 40 లక్షల మందికి పైగా పిల్లలు మొదటి డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొందారు.

Corona Vaccination: దేశ‌వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో కేంద్రం ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మ‌హామ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ నే స‌రైన మార్గ‌మ‌ని నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగా సోమ‌వారం నుంచి సోమవారం 15 నుంచి 18 ఏళ్ల వారికి (టీనేజర్లకు) టీకాలను వేయ‌డం ప్రారంభించింది కేంద్రం. ఈ వ్యాక్సినేష‌న్ కు అనూహ్యం స్పంద‌న వ‌చ్చింది. తొలిరోజే రికార్డ్ స్థాయిలో టీకా పంపిణీ జరిగింది. దేశవ్యాప్తంగా సోమవారం 15 నుంచి 18 ఏళ్ల వయసు గల 40 లక్షల మందికిపైగా  కరోనా మొదటి డోసులు వేశారు. 

CoWIN పోర్టల్  డేటా ప్రకారం, సోమవారం రాత్రి గంటల వరకు.. తొలి రోజు టీకా డ్రైవ్‌లో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 39.88 లక్షల మంది పిల్ల‌ల‌కు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అర్హులైన టీనేజర్లు సుమారు 10 కోట్ల మంది వరకూ ఉన్నారు.ఇక టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో 3 రోజుల్లోనే దాదాపు 53 లక్షల మందికిపైగా టీనేజర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం గమనార్హం. 

Read Also: coronavirus:యూర‌ప్ పై క‌రోనా విజృంభ‌ణ‌.. 100 మిలియ‌న్ల‌కు పైగా కేసులు

ఈ క్ర‌మంలో తొలి రోజు టీకాలు వేసుకున్న టీనేజర్లను ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి అభినందించారు. ‘‘భారత్‌ చేపడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీనేజర్లు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు విధిగా టీకాలు తీసుకోవాలి’’ అని పిలుపునిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.  
ఢిల్లీలో సాయంత్రం 6 గంటల వరకు 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న 20,998 మంది పిల్లలకు టీకాలు వేశారు.  పంజాబ్ లో 3071 మంది పిల్లలు, చండీగఢ్ లో 1826 మంది పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ చేశారు. కేరళలో అత్య‌ధికంగా.. మొదటి రోజు టీకా డ్రైవ్‌లో దాదాపు 38,417 మంది పిల్లలకు టీకాలు వేశారు.

Read Also: Mumbai లో క‌రోనా విజృంభ‌న‌.. 20 వేలు దాటితే లాక్ డౌన్..!

 ఈ వారంలోగా 36 లక్షల మంది బాలలకు టీకా తొలి డోసు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుజరాత్‌లోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికార వర్గాలు ప్రకటించాయి. కాగా, జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్‌ డోసు ఇవ్వనున్నారు.  Omicron వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య 15-18 సంవత్సరాల వయస్సు గల  టీనేజ‌ర్లు కూడా కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌ను స్వీకరించడానికి అర్హులు అని ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 25 న ప్రకటించిన విష‌యం తెలిసిందే. 

Read Also: ఒమిక్రాన్ స‌హ‌జ వ్యాక్సిన్ కాదు. అది త‌ప్పుడు అభిప్రాయం- ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ షాహిద్ జమీల్

 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి కోవాక్సిన్ మాత్రమే ఇవ్వాల‌ని, వయోజనుల‌కు . కోవాక్సిన్‌తో పాటు, కోవాషీల్డ్, స్పుత్నిక్ V వ్యాక్సిన్‌లు ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్ల‌ల‌లో రోగనిరోధకత.. నివారణ మోతాదుల పెంచేందుకే ఈ వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన‌ట్టు తెలిపారు. దేశంలో క‌రోనా వ్యాప్తి పెరుగుతుండ‌టంతో వ్యాక్సినేష‌న్ ను వేగవంతం చేశారు. దేశంలోని 11కి పైగా రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివ‌ర‌కూ 100 శాతం ఫస్ట్ డోస్ ఇమ్యునైజేషన్ సాధించగా, మూడు రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం పూర్తి రోగనిరోధక శక్తిని సాధించాయి.

click me!