కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌.. ఐసోలేషన్‌లో Priyanka Gandhi..

Published : Jan 03, 2022, 11:12 PM IST
కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌.. ఐసోలేషన్‌లో Priyanka Gandhi..

సారాంశం

దేశంలో క‌రోనా దడ పుట్టిస్తోంది. క్ర‌మంగా కేసులు పెరగడం..  టెన్షన్ పుట్టిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. అలాగే ఆమె ఆఫీసు స్టాఫ్‌లోనూ ఒకరికి కరోనా సోకింది. దీంతో ప్రియాంక గాంధీ కొన్ని రోజుల పాటు ఐసోలేష‌న్ లో ఉండ‌నున్న‌ట్టు తెలిపింది.    

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. అదే స‌మ‌యంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెర‌గ‌డం ద‌డ పుట్టిస్తోంది. మహమ్మారికి మనమెంత దూరమున్న.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాడి చేయడమే దాని ప్రధాన లక్షణమైపోయింది. ఈ వైర‌స్ కు ఒక‌రూ ఎక్కువ .. ఒక్క‌రూ త‌క్కువ అనే తేడానే లేదు.. అంద‌రిని స‌మానంగా చూస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, ఇత‌ర సెలబ్రటీలు కూడా దాని బారిన పడుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, బీజేపీ ఎంపీ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ సోకింది. తాజాగా కాంగ్రెస్​ అగ్రనేత  ప్రియాంకా గాంధీ ఐసోలేషన్​కు వెళ్లారు.

 కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ఐసోలేషన్​లోకి వెళ్లారు. తన వ్య‌క్తిగత‌ సిబ్బందిలో ఒక‌రికి, అలాగే.. త‌న‌ కుటుంబ సభ్యుడికి ఒక్క‌రూ కరోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రియాంకకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్​గా వచ్చింది. కానీ ముందు జాగ్ర‌త‌గా తనను కొద్ది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ స్వయంగా తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో సోమవారం రాత్రి పోస్ట్‌ చేశారు. త‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికి క‌రోనా వ‌చ్చింద‌నే విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు.  

Read Also: Coronavirus: మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా
 
ఇదిలా ఉంటే.. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.. యూపీ కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జీ కూడా.. దీంతో ఆమె ఐసోలేష‌న్ యూపీ ఎన్నిక‌ల మీద క‌చ్చితంగా పడుతుంది. యూపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టేందుకు ఆమె చాలా కృషి చేస్తున్నారు.  ఈ నెల  9న ఉత్తరాఖండ్​లోని అల్మోరాలో జ‌రిగే.. బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా  పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె స‌డెన్ గా ఐసోలేషన్​కు వెళ్లడంతో.. సభ నిర్వహణపై ప‌లు సందేశాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఈ స‌మావేశం నిర్వ‌హించాలా?  లేదా? అనేది. జ‌న‌వరి 4 న తెలియ‌నున్న‌ది.

Read Also:  ఒమిక్రాన్ ఎఫెక్ట్:ఈ నెల 8 నుండి 16 వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు

మరోవైపు, బీహార్ ​కు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర మాజీ సీఎం జీతన్​రామ్ మాంఝీ క‌రోనా బారిన ప‌డ్డారు. మాంఝీతో పాటు ఆయన కుటుంబంలో మరో 18 మందికీ కరోనా నిర్ధరణ అయింది. వీరంతా తమ స్వగ్రామమైన మహాకర్​లో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మాంఝీ పార్టీ అయిన హిందుస్థాన్ ఆవమ్ మోర్చా ప్రతినిధి డానిష్ రిజ్వాన్ తెలిపారు.  అలాగే.. బీజేపీ ఎంపీ డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ బారిన ప‌డ్డారు.ప్ర‌స్తుతం ఆయ‌న‌  గాజియాబాద్​లోని ఓ ప్ర‌భుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఆయ‌న కాస్త ఇబ్బంది ప‌డ‌టంతో సోమవారం తెల్లవారుజామున ఆయనను ఐసీయూకు త‌ర‌లించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?