Viral Video : ఆపరేషన్ సింధూర్ పాట... మనోజ్ తివారీ నోట

Published : May 19, 2025, 07:44 PM IST
Viral Video : ఆపరేషన్ సింధూర్ పాట... మనోజ్ తివారీ నోట

సారాంశం

ఆపరేషన్ సింధూర్‌లో భారతీయ సైన్యం ధైర్యసాహసాలకు నివాళిగా బీజేపీ కొత్త దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. మనోజ్ తివారీ రాసి, పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Operation Sindoor Song : భారతీయ జనతా పార్టీ (BJP) ఆపరేషన్ సింధూర్ పై ఓ గీతాన్ని విడుదల చేసింది. హిందీలో 'నిషానీ దేఖ్ లో, యే నిషానీ' అంటూ సాగే ఈ దేశభక్తి గీతం ఆకట్టుకునేలా ఉంది. ఉగ్రవాదంపై భారత్ సాధించిన విజయం సైన్యం, వైమానిక, నౌకాదళాలకు అంకితమంటూ ఈ పాట దేశభక్తిని నూరిపోసేలా ఉంది. అలాగే ఈ పాటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కీర్తించారు. టర్కీ, చైనా డ్రోన్ల వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపారు.

మనోజ్ తివారీ అద్భుత రచన, స్వరాలు, గాత్రం

బీజేపీ ఎంపీ, గాయకుడు మనోజ్ తివారీ ఈ పాటను స్వయంగా రాయడమే కాదు సంగీతం కూడాా సమకూర్చారు. అంతేకాదు ఈ పాటను పాడింది కూడా ఆయనే. 30 లక్షల సైనికుల వెనక150 కోట్ల భారతీయులు ఉన్నారంటూ ఈ పాట సాగుతుంది. 

 సైనిక దళాలకు గౌరవంగానే కాకుండా, దేశభక్తిని నమ్మే ప్రతి భారతీయుడికి ఈ పాట అంకితం అని మనోజ్ తివారీ అన్నారు. సైన్యం దృఢత్వం, నాయకత్వం, మహిళా శక్తిని కూడా పాటలో చూపించారు.

 

 

కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక 

పాట పోస్టర్‌లో ఆపరేషన్ సింధూర్ మీడియా సమావేశంలో కనిపించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఆ మిషన్‌కు ఈ ఇద్దరు అధికారులు కీలకంగా మారారు. మీడియాకు ఆపరేషన్ సిందూర్ వివరాాలను వెల్లడించిన ఈ ఇద్దరు మహిళలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 

బీజేపీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియాలో ఈ పాటను విడుదల చేశారు. ఇది ప్రజలకు విపరీతంగా నచ్చడంతో విడుదలైన కొన్ని గంటల్లోనే వేల వీక్షణలు, షేర్లు వచ్చాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు