Viral Video: రైలు హైజాక్ వెన‌క ఇంత పెద్ద స్కెచ్ ఉందా.. వీడియో రిలీజ్ చేసిన బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ

Published : May 19, 2025, 03:03 PM ISTUpdated : May 19, 2025, 03:04 PM IST
Balochistan liberation army

సారాంశం

బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీడియా విభాగం హక్కల్, దర్రా-ఎ-బోలన్ 2.0 అనే ఆపరేషన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన 35 నిమిషాల వీడియోను విడుదల చేసింది.

స్వతంత్ర దేశం కోసం పోరాడుతోన్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశం దొరికినప్పుడల్లా పాక్ ఆర్మీపై దాడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ లో జాఫర్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హైజాక్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. బలూచిస్థాన్ లిబరేషన్ మీడియా విభాగం హక్కల్, దర్రా-ఎ-బోలన్ 2.0 అనే ఆపరేషన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన 35 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో పాకిస్తాన్ అధికారిక వాదనలను ఖండిస్తూ, బిఎల్ఏ నియంత్రణను చూపిస్తుంది.

వీడియోలో బిఎల్ఏ పోరాట యోధులు రైలులో సమన్వయంతో క్లియరెన్స్ ఆపరేషన్ చేస్తున్నట్లు చూపిస్తుంది. మహిళలు, పిల్లలు, వృద్ధులను సురక్షితంగా తరలించడాన్ని చూపిస్తుంది. పాకిస్తాన్ సైన్యం చెప్పినట్లు విచక్షణారహితంగా, క్రూరంగా తాము దాడి చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశఆరు. 

 

 

వీడియోలో బిఎల్ఏ పోరాట యోధుడు,  మాట్లాడుతూ.. "మా పోరాటం, యుద్ధం ఇలాంటి క్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితికి వచ్చింది. మా యువత ఇలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు తప్ప వేరే మార్గం లేదని వారికి తెలుసు. తుపాకీని ఆపడానికి తుపాకీ అవసరం." అని అన్నారు.

బిఎల్ఏ యువకులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువుపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. నేడు ఒక కొడుకు తన తండ్రిని వదిలి తన ప్రాణాలను త్యాగం చేస్తున్నాడు, అలాగే ఒక తండ్రి తన కొడుకును వదిలి తన ప్రాణాలను త్యాగం చేస్తున్నాడు.

పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి డీజీఐఎస్పీఆర్, బిఎల్ఏకి భారీ నష్టం జరిగిందని చెప్పారు. కానీ బిఎల్ఏ తమ ఫిదాయీన్ యూనిట్--మజీద్ బ్రిగేడ్--పేర్లు, ఫోటోలు, వీడ్కోలు సందేశాలను చూపించింది. దీని ద్వారా తక్కువ నష్టం జరిగిందని, వారి ఆపరేషన్ బలంగా ఉందని చెప్పకనే చెప్పారు. బలూచిస్తాన్‌లో బిఎల్ఏ సాయుధ పోరాటం కొనసాగుతుందని, స్వయంప్రతిపత్తి, హక్కుల కోసం ప్రాంతం సంఘర్షణలో చిక్కుకున్నందున తిరుగుబాటు తీవ్రత పెరుగుతుందని వీడియో ధృవీకరిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu