భారత దేశమేమీ ధర్మసత్రం కాదు..: అక్రమ వలసలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Published : May 19, 2025, 06:06 PM IST
The Supreme Court of India (Photo/ANI)

సారాంశం

అక్రమ వలసలపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. శ్రీలంక శరణార్థుల ఆశ్రయం పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం భారతదేశమేమీ ధర్మసత్రం కాదని పేర్కొంది.  

 భారతదేశంలోకి చుట్టుపక్కల దేశాల నుండి అక్రమ వలసలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మయన్మాన్, బంగ్లాదేశ్, శ్రీలకం వంటి దేశాల నుండి భారత్ లోకి అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వలసలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది... శరణార్థులకు దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని స్పష్టం చేసింది.

శ్రీలంకకు చెందిన శరణార్థులు తమకు భారతదేశంలో ఆశ్రయం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిన్ వినోద్ చంద్రన్ బెంచ్ ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే భారతదేశమేమీ ధర్మశాల కాదు.. కాబట్టి శరణార్థులు వెంటనే దేశాన్ని వీడాలని ఆదేశించారు. ఇలా శ్రీలంక శరణార్థుల పిటిషన్ ను కొట్టివేస్తే సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే భారతదేశం అధిక జనాభాతో ఇబ్బందిపడుతోంది... ఇలాంటిది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో వారి దేశాన్ని విడిచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నా శరణార్థులు దేశాన్ని వీడాల్సిందేనని అన్నారు. భారత్ విదేశీయులకు వినోదం అందించే ధర్మశాల కాదని జస్టిస్ దీపాంకర్ దత్త ఘాటు కామెంట్స్ చేసారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు ఏమాత్రం ఒప్పుకోలేదు. పిటిషనర్ శ్రీలంకకు చెందిన తమిళుడని... అతడి ప్రాణాలకు ముప్పు ఉండటంతో భారత్ కు వలస వచ్చాడని న్యాయవాది తెలిపారు. అతడికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. భార్యాపిల్లలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అయినప్పటికి ప్రస్తుతం జైల్లో ఉన్న పిటిషనర్ విడుదల కాగానే దేశాన్ని విడిచి వెళ్లాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. వారి దేశంలో ముప్పు ఉంటే భారతదేశంలోనే ఎందుకుండాలి... వేరే దేశానికి వెళ్లవచ్చుకదా అని సుప్రీంకోర్టు నిలదీసింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !