Operation Sindoor: భారత్‌ మెరుపుదాడిలో 90 మంది ఉగ్రవాదులు మృతి? అందుకే పాక్ ఆ విషయాన్ని దాచిపెడుతుందా?

Published : May 07, 2025, 09:15 PM IST
 Operation Sindoor: భారత్‌ మెరుపుదాడిలో 90 మంది ఉగ్రవాదులు మృతి? అందుకే  పాక్ ఆ విషయాన్ని దాచిపెడుతుందా?

సారాంశం

Operation Sindoor:  సర్జికల్ స్ట్రైక్‌లో 90 మంది చనిపోయారని, చాలామంది ఉగ్రవాదులు గాయపడినట్టు తెలుస్తోంది.

Operation Sindoor:  ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత్ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసినట్లు తెలుస్తోంది. అరగంట పాటు జరిగిన ఈ దాడిలో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించింది. కానీ 90 మంది చనిపోయారని, వారిలో చాలామంది ఉగ్రవాదులు కావడంతో పాకిస్తాన్ సమాచారాన్ని దాచిపెడుతోందని వార్తలు వస్తున్నాయి.

భారత్‌లో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగినా ' ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు' అని పాకిస్తాన్ అంటున్నారు. ఈ విషయం పార్లమెంట్ దాడిలో, ఉరిలో, పుల్వామాలో, రెండు వారాల క్రితం పహల్గాంలో కూడా పాకిస్తాన్ వైఖరి ఇదే. కానీ నేడు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా నిర్వహించిన మీడియా సమావేశంలో పాక్ నిజస్వరూపాన్ని బయటపడింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల శిక్షణా కేంద్రాల దృశ్యాలు, భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన దృశ్యాలను మీడియా ముందు పెట్టారు. ధ్వంసం చేసినవి ఉగ్రవాద కేంద్రాలనేనని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా స్పష్టం చేశారు.

ఆపరేషన్ సింధూర్ ఎలా చేపట్టారంటే..? 

భారతకాలమానం ప్రకారం ఉదయం 1.05 నుంచి 1.30 వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగింది.  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ మిస్సెల్ వర్షం కురిపించింది. ఈ ఎయిర్ స్ట్రైక్ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ’ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. భవల్‌పూర్, మురిద్కే, సిలాల్‌కోట్, కోట్లి, భింబీర్, టెహ్రకలాన్, ముజఫరాబాద్‌లలో తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై రాఫెల్ యుద్ధ విమానాలతో మిస్సెల్ వర్షం కురిపించారు.  

ఆపరేషన్ సిందూర్ గురించి ఉదయం 1.44 కి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతీకార దాడి వివరాలను ప్రపంచానికి తెలియజేసింది. ఆ తర్వాత దాడి జరిగిన ప్రదేశాల దృశ్యాలను, వీడియోలను వెల్లడించారు. ఈ దాడిలో  జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కుటుంబంలోని 14 మంది ఈ దాడిలో మరణించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ దాడిని రాత్రంతా దగ్గరుండి పర్యవేక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానికి వివరాలు అందించారట.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !