Rajnath Singh: జాతీయ భ‌ద్ర‌త‌కే తొలి ప్రాధాన్యం.. భార‌త్‌లోనే ఆయుధాల తయారీ..

By Mahesh Rajamoni  |  First Published Dec 19, 2021, 12:54 PM IST

Rajnath Singh: జాతీయ భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అందుకే భారత్‌కు అవసరమైన ఆయుధాలను దేశీయంగానే తయారు చేయాలని మిత్ర దేశాలను కోరినట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. Federation of Indian Chambers of Commerce and Industry నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ పై వ్యాఖ్య‌లు చేశారు. 
 


Rajnath Singh: జాతీయ భ‌ద్ర‌త‌కే తమ తొలి ప్రాధాన్య‌మ‌నీ, దానికి అనుగుణంగా అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) (Federation of Indian Chambers of Commerce and Industry- FICCI) స‌మావేశంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, దేశానికి అవ‌స‌ర‌మైన ఆయుధాల‌ను దేశీయంగానే త‌యారు చేయ‌డానికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.  దేశ‌ భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలను, సైనిక పరికరాలను తమ గడ్డపైనే తయారుచేయాలని అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌ తదితర భాగస్వామ్య దేశాలకు స్పష్టం చేసినట్టు  వెల్లడించారు. చైనా, పాకిస్థాన్ దేశాల కుతంత్రాల‌ను సైతం ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. స్వ‌తంత్య్రం అనంత‌రం దేశ విభ‌జ‌న కార‌ణంగా పుట్టిన ఓ దేశం (పాకిస్థాన్‌)  భారత పురోగతిని చూసి దానికి కడుపు మండిపోతున్నదని అన్నారు. అలాగేర మ‌రో భార‌త స‌రిహ‌ద్దు దేశం (చైనా) భార‌త్ కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ.. నిత్యం కొత్త ప్రణాళికలను రూపొందించుకోవడంలో నిమగ్నమైందంటూ ఆరోపించారు.  

Also Read: Priyanka Gandhi: ఏడేండ్లలో ఏం ఉద్దరించారు? : కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

Latest Videos

undefined

ప్ర‌భుత్వం జాతీయ భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న‌ద‌ని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిపారు. జాతీయ  భద్రతే తమ తొలి ప్రాధాన్యమనీ, అందుకే భారత్‌కు అవసరమైన ఆయుధాలను దేశీయంగానే తయారు చేయాలని మిత్ర దేశాలను విన్న‌వించామ‌ని వెల్ల‌డించారు.  ‘‘ఆయుధాల‌ను భారత్‌కు వచ్చి తయారు చేయండి. భారత్‌ కోసం, ప్రపంచం కోసం ఇక్కడే తయారు చేయండి’’ అని భాగస్వామ్య దేశాలకు చెప్పిన‌ట్టు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఆయా దేశాల నుంచి సానుకూలంగానే స్పంద‌న‌లు వ‌చ్చాయ‌ని తెలిపారు. దీనికి అనుగుణంగానే భార‌త్‌లో ఆయుధ సంపత్తి, రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయంటూ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఆయుధాల విష‌యంలో ప్ర‌పంచంలోని ప్ర‌ధాన‌మైన దేశాల‌తో కీల‌క ఒప్పందాలు చేసుకున్నామ‌ని తెలిపారు. ముఖ్యంగా భారత్, ఫ్రాన్స్‌ మధ్య రక్షణ రంగంలో మైత్రి కొత్త పుంతలు తొక్కుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఫ్రాన్స్‌కు చెందిన అగ్రశ్రేణి ఇంజిన్‌ తయారీ సంస్థ భారత్‌లో ఆయుధ వ్యవస్థలకు ఇంజిన్‌ను అభివృద్ధి చేయనుంద‌ని తెలిపారు. దీనికోసం వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద మన దేశానికి చెందిన ఒక కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంద‌ని పేర్కొన్నారు. 

Also Read: Coronavirus: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

ఈ మ‌ధ్య‌కాలంలో భార‌త్ స‌రిహ‌ద్దులో డ్రోన్ లు క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌, చైనా దేశాలు భ‌విష్య‌త్తులో డ్రోన్ ల‌తో దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి. డ్రోన్ల వ్య‌వ‌స్థ గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..  ప్రభుత్వ అధికారులకు డ్రోన్, ఉపగ్రహ చిత్రాల ఆధారిత సర్వేల్లో శిక్షణ ఇచ్చేందుకు ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సెలెన్స్‌ ఇన్‌ ల్యాండ్‌ సర్వే’ను ప్రారంభించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. కాగా, అత్యాధునీక యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందు చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 36 రాఫేల్ యుద్ధ విమానాల కోసం 2016లో ఫ్రాన్స్‌తో ఈ ఒప్పందం కుదిరింది. సుమారు 59వేల కోట్ల‌కు ఆ ఒప్పందం ఇది.  ఇప్పటివరకు పలు దఫాలుగా 33 విమానాలు సరఫరా చేశారు. మిగిలిన 3 విమానాలు ఫ్రాన్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భార‌త్ చేర‌నున్నాయి. కాగా, ఫ్రాన్స్ తో భార‌త్ చేసుకున్న రాఫేల్ యుద్ధ విమానాల‌కు సంబంధించిన ఒప్పంద‌లో అనేక అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల దాడికొన‌సాగించారు.

Also Read: Covid Third wave: జనవరిలో కరోనా థర్డ్ వేవ్.. కొత్తగా సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం !

click me!