చిన్నారులకు బలవంతంగా పోర్న్ చిత్రాలు... నిత్యానందపై మరో కేసు

By telugu news teamFirst Published Mar 10, 2020, 7:47 AM IST
Highlights

కోర్టు ఇచ్చిన  ఆదేశాల మేరకు మార్చి 6 న 14 మందిపై   పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  వారిలో శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులు కూడా ఉన్నారు.ఇదే పోలీసు స్టేషన్‌లోనే గత ఏడాది నవంబర్‌లో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేశారంటూ నిత్యానందపై కేసు నమోదు కావడం గమనార్హం. 

అత్యాచారం, కిడ్నాప్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత బోధకుడు నిత్యానంద లీలలను పోలీసులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇప్పటికే ఆయన పై పలు కేసులు నమోదవ్వగా.. తాజాగా పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిత్యానంద స్వామి ఆశ్రమంలో చిన్నారులకు పోర్న్ చిత్రాలు చూపించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని  పోలీసులు వివరించారు.

అహ్మదాబాద్ శివార్లలో ఉన్న ఆశ్రమంలోని గురుకుల ఖైదీ, నిత్యానంద అనుచరుడు గిరీష్ తుర్లపతి  తొలుత ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. అతను దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన న్యాయస్థానం.. కేసు నమోదు  చేయాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు అహ్మదాబాద్ జిల్లాలోని వివేకానందగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.కోర్టు ఇచ్చిన  ఆదేశాల మేరకు మార్చి 6 న 14 మందిపై   పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  వారిలో శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులు కూడా ఉన్నారు.ఇదే పోలీసు స్టేషన్‌లోనే గత ఏడాది నవంబర్‌లో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేశారంటూ నిత్యానందపై కేసు నమోదు కావడం గమనార్హం. 

Also Read నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటన.. నోటీసులు పంపలేకపోయామన్న పోలీసులు...

కాగా ఈ ఘటనపై గిరీష్ తుర్లపతి మాట్లాడుతూ.. నిత్యానంద చిన్నారులకు మెంటల్ టార్చర్ చూపించేవాడని ఆరోపించారు. చిన్నారులు, మహిళలను బంధించి బలవంతంగా పోర్న్ వీడియోలు చూపించేవాడని చెప్పారు. యువతుల మార్ఫ్డ్ వీడియోలు చూపించి బ్లాక్ మొయిల్ చేసేవాడని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. నిత్యానంద స్వామి 2018లో దేశం విడిచిపారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు కూడా ప్రకటించాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్ పోల్ ఇటీవల బ్లకార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్‌లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు.

click me!