Operation sindoor: పాక్ ప‌రువు మొత్తం పోయిందిగా.. అడ్డంగా బుక్ అయిన పాకిస్థాన్‌ ర‌క్ష‌ణ మంత్రి

పాకిస్థాన్ వంకర బుద్ధి మారడం లేదు. దేశాన్ని ఉగ్రవాదుల శిక్ష‌ణ కేంద్రానికి అడ్డాగా మారుస్తూ, భార‌త్‌లో అశాంతిని సృష్టిస్తున్న పాకిస్థాన్‌కు స‌రైన బుద్ధి చెబుతూ భార‌త ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌య‌వంత‌మైన విష‌యం తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం త‌న మేక‌పోతు గాంభీర్యాన్ని చూపిస్తూనే ఉంది. 
 

Google News Follow Us

ఈ క్ర‌మంలోనే తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్య‌లపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రంగా విమర్శలు వ‌స్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 5 ఫైటర్ జెట్ లను కూల్చినట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి పాకిస్థాన్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేస్తోంది. 

ఇదే విష‌య‌మై తాజాగా అంత‌ర్జాతీయ మీడియా స్థంతో మాట్లాడుతూ ఖ‌వాజా ఆసిఫ్ ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఏవైనా ఉన్నాయా అని యాంక‌ర్ అడ‌గ్గా విచిత్ర‌మైన స‌మాధానం ఇచ్చాడు. సరైన ఆధారాలు చూపలేక, “అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జ‌రుగుతోంది. 

పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం అధికారికంగా లేవనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. సైనిక దాడుల వంటి సున్నితమైన అంశాలపై సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియోల ఆధారంగా మాట్లాడటం, అంతర్జాతీయ మాధ్యమాల్లో అప్రతిష్ఠకు దారి తీసింది. సాధారణ పౌరులు చేయగలిగే పొరపాట్లను దేశ రక్షణ వ్యవస్థను ప్రతినిధ్యం వహించే మంత్రి చేస్తే, దాని ప్రభావం ఎంతవారూ తీవ్రంగా ఉంటుంది.

'ఆపరేషన్ సింధూ ద్వారా త‌మ దేశంలో జ‌రిగిన న‌ష్టాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకే పాకిస్థాన్ ఇలాంటి పిచ్చి వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పాకిస్థాన్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను భారత ప్రభుత్వం కానీ, అంతర్జాతీయ పత్రికలు కానీ ధృవీకరించలేదు. 

సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి నిజం అని చెప్పడం సైనిక మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఫైటర్ జెట్ కూల్చినట్లయితే, అది సాంకేతిక ఆధారాలతో, శాటిలైట్ చిత్రాలతో నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అలాంటి ఘటనలపై సంబంధిత దేశాలు అధికారికంగా స్పందిస్తాయి. 

Read more Articles on