Operation Sindoor: కేంద్రం సమక్షంలో అల్ పార్టీ మీటింగ్..ఏం చర్చించనున్నారంటే

Published : May 08, 2025, 07:49 AM IST
Operation Sindoor: కేంద్రం సమక్షంలో అల్ పార్టీ మీటింగ్..ఏం చర్చించనున్నారంటే

సారాంశం

ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత, కేంద్రం గురువారం సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్తాన్‌పై చర్య, సరిహద్దు భద్రతపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.

ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత, కేంద్రం నేడు సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్తాన్‌పై సైనిక చర్య, సరిహద్దు భద్రతపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

అల్ పార్టీ మీటింగ్

ఇలాంటి సున్నితమైన విషయాల్లో అందరూ కలిసి నడవాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడులకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అందుకే అందరినీ ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ మీటింగ్ కి  హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

రాహుల్ గాంధీ హాజరు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నట్లు తెలుస్తుంది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తదితరులు హాజరవుతారు. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ, అన్ని ప్రధాన పార్టీల నేతలు హాజరవుతారని చెప్పారు. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం మొదలవుతుంది. కిరణ్ రిజిజు ఈ సమాచారాన్ని తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు.జాతీయ భద్రతపై చర్చించడానికి మే 8న ఢిల్లీలో సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పోస్ట్‌లో రాశారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 22న కూడా సర్వపక్ష సమావేశం జరిగింది.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu