నీట్-2019 ఫలితాల వెల్లడి: తెలంగాణకు ఏడో ర్యాంకు, ఏపీకి 16

By narsimha lodeFirst Published Jun 5, 2019, 3:19 PM IST
Highlights

నీట్ 2019  పరీక్ష ఫలితాలను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం నాడు ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నళిని ఖేండల్ వాల్ ప్రథమ ర్యాంకు సాధించారు.


న్యూఢిల్లీ: నీట్ 2019  పరీక్ష ఫలితాలను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం నాడు ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నళిని ఖేండల్ వాల్ ప్రథమ ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్ధికి 7వ ర్యాంకు, ఏపీ విద్యార్ధికి 16వ ర్యాంకు దక్కింది.

720 మార్కులకు గాను 701 మార్కులను నలిని ఖేండల్‌వాల్ సాధించారు. ఢిల్లీకి చెందిన భవిక్ బసంత్ 700 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు.  యూపీకి చెందిన అక్షాంత్ అక్షార్ కౌశిక్ అనే విద్యార్ధికి కూడ 700 మార్కులు వచ్చాయి. ఆయనకు మూడో ర్యాంకు కేటాయించారు.

తెలంగాణలో 68.88 శాతంతో 33,044 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో 72.55 శాతంతో 39,039 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ విద్యార్ధిని జి. మాధురిరెడ్డికి ఏడో ర్యాంకు దక్కింది.మాధురిరెడ్డికి 695 మార్కులు వచ్చాయి.  ఏపీకి చెందిన ఖురేషీ అస్రాకు 16వ ర్యాంకు దక్కింది. అస్రాకు 690 మార్కులు వచ్చాయి.టాప్ 50 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు 4 ర్యాంకులు వచ్చాయి. 

click me!