Flag Code: ఇక నుంచి రాత్రివేళ‌ కూడా జెండా ఎగ‌ర‌వేయ‌వ‌చ్చు.. జెండా ఎగురవేసేట‌ప్పుడు పాటించాల్సిన‌ నియమాలివే..

By Rajesh KFirst Published Jul 24, 2022, 2:15 PM IST
Highlights

National Flag Code: ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై  త్రివర్ణ పతాకాన్ని ఎగ‌ర‌వేయాల‌ని (Har Ghar Tiranga) కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11 నుంచి 17 వరకు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగ‌ర‌వేయాలి. ఈ నేప‌థ్యంలో ఫ్లాగ్ కోడ్‌ను ప్రభుత్వం మార్చింది. 

National Flag Code: వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ  కార్య‌క్ర‌మం ప్రకారం.. దేశ‌వ్యాప్తంగా ప్రతి ఇంటిపై మూడు రోజుల పాటు త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలి. ఈ నేపథ్యంలో ఫ్లాగ్ కోడ్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది,  
 
స‌వ‌ర‌ణ చేసిన నిబంధనల ప్రకారం..  పగలు, రాత్రి వేళ‌ల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అనుమతించ‌బ‌డింది. అలాగే ఇప్పుడు పాలిస్టర్, మెషిన్ మేడ్ జాతీయ జెండాను కూడా ఉపయోగించవచ్చు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద ప్రభుత్వం ఆగస్టు 13 నుండి 15 వరకు 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌బ‌డుతుంది. ఈ కార్య‌క్ర‌మాన్నిదృష్టిలో ఉంచుకుని.. కేంద్రం ఈ స‌వ‌ర‌ణ‌కు తీసుక‌వచ్చింది.

ఈ క్ర‌మంలో కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు. భారత జాతీయ జెండాను ప్రదర్శించడం, ఎగురవేయడం, ఉపయోగించడం వంటివి భారత జెండా కోడ్- 2002, జాతీయ గర్వానికి అవమానాల నిరోధక చట్టం- 1971 కింద వస్తాయ‌ని తెలిపారు. ఈ లేఖ‌లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002ను  జూలై 20, 2022 న స‌వ‌రించిన‌ట్టు తెలిపారు. 

Latest Videos

నూత‌న‌ నియమం  

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002లోని పార్ట్ IIలోని పారా 2.2లోని క్లాజ్ (11) ఇప్పుడు 'జెండా బహిరంగ ప్రదేశంలో ఎక్కడ ప్రదర్శించబడుతుందో లేదా పౌరుడి నివాసంలో ప్రదర్శించబడితే.. అది పగలు, రాత్రి ఎగురవేయడానికి అనుమ‌తించ‌బ‌డుతుంది. అంతకుముందు.. త్రివర్ణ పతాకాన్ని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది.  
 
అదేవిధంగా.. ఫ్లాగ్ కోడ్‌లోని మరొక నిబంధనను సవరించారు. జాతీయ జెండాను చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి / పాలిస్టర్ / ఉన్ని / పట్టు ఖాదీతో చేయబడిన త్రివ‌ర్ణ ప‌తాకాల‌ను ఎగ‌ర‌వేయ‌డానికి అనుమ‌తించ‌బ‌డింది. అంతకు ముందు.. యంత్రంతో తయారు చేయబడిన మరియు పాలిస్టర్ తయారు చేసిన జాతీయ జెండాను ఉపయోగించడంపై నిషేధం ఉండేది. 2002కి ముందు.. స్వాతంత్య్ర‌ దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతించేవారు. భారతీయ జెండా కోడ్ 26 జనవరి 2002న సవరించబడింది, ఆ తర్వాత పౌరులు ఏ రోజునైనా జెండాను ఎగురవేయవచ్చు.

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేట‌ప్పుడు పాటించాల్సిన‌ నియమాలు 
 
1- ప్రస్తుతానికి చేతితో నేసిన ఉన్ని, పత్తి, పట్టు లేదా ఖాదీతో ఎగ‌ర‌వేసిన జెండాను ఎగ‌ర‌వేయాలి. అయితే.. తాజాగా ఈ నిబంధ‌న‌ను ప్రభుత్వం సవరించింది. స‌వ‌ర‌ణ నియ‌మం ప్ర‌కారం.. పాలిస్టర్,  మెషిన్‌తో చేసిన జాతీయ జెండాను ఉపయోగించవచ్చు.

2. జెండా ఆకారం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. దాని పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 3:2 ఉండాలి.  

3. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం మధ్య మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. ఈ నియ‌యాన్ని కేంద్రం స‌వ‌ర‌ణ చేసింది.

4. జెండాను ఎప్పుడూ నీటిలో ముంచకూడదు. ఏ విధంగానూ భౌతిక నష్టాన్ని కలిగించకూడదు. జెండాలోని ఏదైనా భాగానికి నష్టం కలిగించడం లేదా అవమానించినట్లయిత.. మూడు సంవత్సరాల వరకు మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.

5. జెండాను వాణిజ్యపరంగా ఉపయోగించ‌రాదు. ఎవరికీ సెల్యూట్ చేయడానికి జెండాను అవనతం చేయరు. జెండాను వస్త్రంగా మార్చినా.. విగ్రహానికి చుట్టిన‌ లేదా చనిపోయిన వ్యక్తి (అమరవీరులైన సాయుధ దళాల సైనికులు కాకుండా) మృతదేహంపై ఉంచినట్లయితే.. అది త్రివర్ణ పతాకాన్ని అవమానించినట్లుగా పరిగణించబడుతుంది.

6. త్రివర్ణ యూనిఫాం ధరించడం తప్పు. ఎవరైనా త్రివర్ణ పతాకాన్ని నడుము కింద గుడ్డలాగా ధరిస్తే అది కూడా అవమానమే. లోదుస్తులు, రుమాలు లేదా కుషన్లు మొదలైన వాటిని తయారు చేయడం కూడా అవమానించ‌డ‌మే.
 
7. జెండాపై ఎలాంటి అక్షరాలు రాయ‌రాదు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో.. జాతీయ జెండా ఆవిష్కరించే ముందు పూల రేకులు ఉంచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

8. ఏ కార్యక్రమంలోనైనా స్పీకర్ టేబుల్‌ను కవర్ చేయడానికి లేదా వేదికను అలంకరించడానికి జెండాను ఉపయోగించకూడ‌దు. వాహనాల‌కు, రైలు లేదా విమానం యొక్క పైకప్పు, పక్క లేదా వెనుక భాగాన్ని కవర్ చేయడానికి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఉపయోగించ‌కూడ‌దు.  

9. ఎగురవేయబడిన జెండా యొక్క స్థితి గౌరవప్రదమైన రీతిలో నిర్వహించబడాలి. చిరిగిన లేదా మురికి జెండాను ఎగురవేయకూడదు. జెండా చిరిగిన‌, మురికిగా మారితే.. దానిని ఏకాంతంగా  పూర్తిగా నాశనం చేయాలి.

10. ఒక వేదికపై జెండాను ఎగురవేస్తే.. స్పీకర్ ముఖం ప్రేక్షకుల వైపు ఉన్నప్పుడు, జెండా అతని కుడి వైపున ఉండే విధంగా ఉంచాలి. 

click me!