Narendra Modi Birthday : నరేంద్ర.. మీ సహకారానికి ధన్యవాదాలు : ట్రంప్ స్పెషల్ భర్త్ డే విషెస్

Published : Sep 17, 2025, 07:27 AM IST
Narendra Modi Birthday

సారాంశం

Narendra Modi Birthday : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నారు . తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఫోన్ చేసి భర్త్ డే విషెస్ తెలిపానంటూ మరోసారి ప్రశంసలు కురిపించారు. 

Narendra Modi Birthday : ఇవాళ (సెప్టెంబర్ 17, బుధవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు. ఈ క్రమంలో ఆయనకు వివిధ దేశాధినేతల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పీఎం మోదీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లు స్వయంగా వెల్లడించారు. అంతేకాదు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కూడా మోదీతో చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. 

మోదీ చాలా మంచి పని చేస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్

పీఎం మోదీతో జరిగిన సంభాషణపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, "ఇప్పుడే నా మిత్రుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో చాలా మంచి సంభాషణ జరిగింది. నేను ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను! ఆయన చాలా మంచి పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడంలో మద్దతు ఇచ్చినందుకు నరేంద్ర మోదీకి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

 

థ్యాంక్యూ మై ప్రెండ్ ట్రంప్ : నరేంద్ర మోదీ

ట్రంప్ భర్త్ డే విషెస్ పై పీఎం మోదీ ఎక్స్ లో స్పందించారు. "నా 75వ పుట్టినరోజున మీరు ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు మిత్రుడు, ప్రెసిడెంట్ ట్రంప్ కు ధన్యవాదాలు. మీలాగే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర, గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించే దిశగా మీ చొరవకు మేము మద్దతిస్తాం." అని రాశారు.

 

 

భారత్ పై ట్రంప్ 50% టారిఫ్స్ ఎఫెక్ట్  

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతులపై 50% టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దీనివల్ల రెండు దేశాల సంబంధాలపై ప్రభావం పడింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ 25% అదనపు టారిఫ్ విధించారు. దీనిపై భారత్ కూడా ధీటుగానే జవాభిచ్చింది… తాము ఏ ఒత్తిడికి లొంగేది లేదని. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపబోమని తేల్చి చెప్పింది. 

అయితే గత కొన్ని రోజులుగా అమెరికా వైపు నుంచి ఉద్రిక్తత తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి… భారత్ కూడా వాటిని స్వాగతిస్తోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా జరిగాయి. అంతేకాదు పదేపదే ట్రంప్ ప్రధాని మోదీ నా మిత్రుడు అంటూ చేస్తున్న కామెంట్స్ భారత్ విషయంలో అతడు కాస్త వెనక్కి తగ్గాడని అర్థమవుతోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !