ప్రధాని మోడీ - డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సెన్ టెలిఫోన్ చర్చలు

Published : Sep 16, 2025, 09:08 PM IST
PM Modi Talks With Denmark PM On Green Partnership

సారాంశం

PM Modi Talks With Denmark PM: ప్రధాని నరేంద్ర మోడీ, డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సెన్ తో టెలిఫోన్ పలు కీలక విషయాలపై చర్చించారు. ప్రాంతీయ, ప్రపంచ స్థాయి సమస్యలపై కూడా మాట్లాడారు.

PM Modi Talks With Denmark PM: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం డెన్మార్క్ ప్రధాని మేట్ ఫ్రెడరిక్సెన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. రెండు దేశాల సంబంధాలపై చర్చలు సాగాయి. ఈ సంభాషణలో రెండు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే అంశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్ తో గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం

రెండు దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడి, ఇన్నోవేషన్, ఎనర్జీ, నీటి నిర్వహణ, ఫుడ్ ప్రాసెసింగ్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో భారత్-డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని మరింత బలపరచేందుకు ఇద్దరు నేతలు అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ డెన్మార్క్ ఈయూ కౌన్సిల్ ప్రెసిడెన్సీ, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లోని నాన్-పర్మనెంట్ సభ్యత్వ విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఉక్రెయిన్ సమస్యపై చర్చలు

ఇద్దరు నేతలు ప్రాంతీయ, ప్రపంచ స్థాయి ముఖ్యమైన సమస్యలపై కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాని మోడీ ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందనీ, శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని తెలిపారు.

ఇండియా-ఈయూ FTA, 2026 AI సమ్మిట్ పై చర్చలు

ప్రధాని ఫ్రెడరిక్సెన్ భారత్-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరగా ముగించడానికి డెన్మార్క్ పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ధరించారు. అలాగే, 2026లో భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ కు కూడా ఫ్రెడరిక్సెన్ మద్దతు తెలిపారు.

ఈ ఫోన్ కాల్ చర్చలలో రెండు దేశాలు వ్యాపారం, సాంకేతికత, శాంతి, గ్లోబల్ పరిరక్షణ రంగాల్లో పరస్పర బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించనున్నట్టు స్పష్టం చేశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !