" నేను అతనితో కావాలనే వెళ్లా ".. 30 ఏళ్ల రేప్ కేసులో బాధితురాలి ట్విస్ట్

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 12:45 PM IST
Highlights

30 సంవత్సరాల పాటు సాగిన అత్యాచారం కేసులో.. బాధితురాలు ఇచ్చిన ట్విస్ట్‌తో నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు. ముంబైలో 1988 జనవరి 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో 17 ఏళ్ల అమ్మాయి.. 16 ఏళ్ల బాలుడి ఇంటికి వెళ్లింది.

30 సంవత్సరాల పాటు సాగిన అత్యాచారం కేసులో.. బాధితురాలు ఇచ్చిన ట్విస్ట్‌తో నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు. ముంబైలో 1988 జనవరి 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో 17 ఏళ్ల అమ్మాయి.. 16 ఏళ్ల బాలుడి ఇంటికి వెళ్లింది.

కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన అమ్మాయి తండ్రి.. తన కూతురు కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టాడు. ఈ క్రమంలో ఓ ఇంట్లో బాలుడితో అభ్యంతరకర స్థితిలో కనిపించింది. దీంతో ఆ కుర్రాడు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే నెల 30వ తేదిన కేసు నమోదైంది.

దీనిపై 30 ఏళ్ల నుంచి సుధీర్ఘ విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. తీర్పుకు ముందు న్యాయస్థానం నాటి బాలిక.. నేటి మహిళ వాదనలు వినింది. ఆనాడు తాను ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్లానని అమ్మాయి చెప్పింది.

నాటి చట్టాల ప్రకారం.. 16 ఏళ్లు దాటిన అమ్మాయి తనంతట తానుగా ఎవరితోనైనా ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నా.. దాన్ని రేప్‌గా పరిగణించే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం 46 ఏళ్ల వయసులో ఉన్న నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లుగా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

మరోవైపు 1988లోనే తాను ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్లానని ఆమె చెప్పినప్పటికీ... కిడ్నాప్, అత్యాచారం కేసులు పెట్టడం.. ఆపై అత్యాచారానికి చట్టంలో నిర్వచనాలు మారిపోతూ ఉండటంతో కేసు విచారణ మూడు దశాబ్ధాల పాటు కొనసాగింది. 

click me!