లోకసభ ఎన్నికల్లో లేడీల రాసలీలల వీడియోలు: రూ. 30 కోట్లకు బేరం

By telugu teamFirst Published Oct 2, 2019, 7:47 AM IST
Highlights

మధ్యప్రదేశ్ సెక్స్ రాకెట్ సూత్రధారులు లోకసభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయ నేతల రాససలీలల వీడియోలను ఏకంగా రూ. 30 కోట్లకు సూత్రధారులు బేరం పెట్టారు. 

భోపాల్: మధ్యప్రదేశ్ హానీ ట్రాప్ కేసులో మరో విషయం వెలుగు చూసింది. రాజకీయ నాయకులకు వల వేసి వారి వద్దకు అమ్మాయిలను పంపించారు. అమ్మాయిలతో నాయకులు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను చిత్రీకరించారు. అంతలో లోకసభ ఎన్నికలు వచ్చాయి.

లోకసభ ఎన్నికల్లో నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. దాన్ని సెక్స్ రాకెట్ నడిపిన మహిళలు క్యాష్ చేసుకుందామని భావిం్చారు. రాసలీలల వీడియోలను విక్రయానికి పెట్టారు. తమకు రూ. 30 కోట్లు ఇస్తే రాసలీలల వీడియోలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. 

వారి ఆఫర్ పై దఫాలవారీగా చర్చలు జరిగాయి. తనకు కొన్ని వీడియోలు కావాలని ఓ రాజకీయ నాయకుడు అడిగాడు. వాటికి రూ. 6 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అయితే వీడియోలను విడివిడిగా ఇవ్వడం కుదరదని, గంపగుత్తగానే ఇస్తామని చెప్పారు. అందుకు తమకు రూ. 30 కోట్లు ఇవ్వాల్సిందేనని సెక్స్ రాకెట్ నిర్వాహకులు పట్టుబట్టారు. 

అయితే, గంపగుత్తగా మొత్తం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వాటిని విడివిడి విక్రయించారు. మొత్తం ప్రభుత్వం మారడంలో హానీ ట్రాప్ ను నడిపిన మహిళల పాత్ర పనిచేసిందని అంటారు. అదేమైనా, హానీ ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ కేసులో మధ్యప్రదేశ్ కోర్టు ఐదుగురు మహిళలకు జ్యుడిషియల్ కస్టడీని 14వ తేదీ వరకు పొడగించింది. 

ఇదిలావుంటే, విచారణ సందర్భంగా తన క్లయింట్ శ్వేతా జైన్ ను దారుణంగా హింసించారని, కొట్టారని ఆమె తరఫు న్యాయవాది ధర్మేంద్ర గుర్జార్ తెలిపారు. ఆయన ఆరోపణలను పోలీసులు ఖండించారు. 

click me!