మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన ఎంకే స్టాలిన్.. ఎస్ఎం నాసర్ ను తొలగించి టీఆర్పీ రాజాకు చోటు.. ఎందుకంటే ?

By Asianet News  |  First Published May 10, 2023, 2:07 PM IST

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఎస్ఎం నాసర్ ను తొలగించి, టీఆర్బీ రాజాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 


తమిళనాడు మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ పునర్ వ్యవస్థీకరించారు. అందులో భాగంగా పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎస్ఎం నాసర్ ను తన కేబినేట్ నుంచి తొలగించారు. ఆయన స్థానంలో టీఆర్బీ రాజాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ చేసిన సిఫార్సులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించారు. ఈ విషయాన్ని తమిళనాడు రాజ్ భవన్ మంగళవారం ప్రకటించింది.

కునో నేషనల్ పార్క్ లో లైంగిక హింసతో ఆడ చిరుత మృతి.. మూడు నెలల్లో మూడో మరణం

Latest Videos

2021లో బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగడం ఇది రెండో సారి. కొత్త మంత్రి డాక్టర్ టీఆర్బీ రాజా మన్నార్గుడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే డీఎంకేకు ఐటీ వింగ్ కు చీఫ్ గా కూడా కొనసాగుతున్నారు.

సల్మాన్ ఖాన్ కు మెయిల్ లో మళ్లీ హత్యా బెదిరింపులు.. ఎవరి నుంచి అంటే ?

కొన్ని నెలల కిందట నాసర్ ఏదో ఒక అంశంపై పార్టీ కార్యకర్తపై రాయి విసిరి వార్తల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనను కేబినేట్ నుంచి స్టాలిన్ విముక్తి చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే టీఆర్పీ రాజా.. డీఎంకే సీనియర్ నేత, లోక్ సభ ఎంపీ టీఆర్ బాలు కుమారుడు.  కాగా.. ఈ నెల 11వ తేదీన ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్ భవన్ తెలిపింది.

click me!