మహాకూటమికి బీటలు: అఖిలేష్‌పై మాయావతి ఫైర్

By narsimha lodeFirst Published Jun 3, 2019, 6:02 PM IST
Highlights

ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రంలో  మహాకూటమి బీటలు వారే సూచనలు కన్పిస్తోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై మాయావతి విరుచుకుపడ్డారు. త్వరలో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయనుందని  ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది.

న్యూఢిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రంలో  మహాకూటమి బీటలు వారే సూచనలు కన్పిస్తోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై మాయావతి విరుచుకుపడ్డారు. త్వరలో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయనుందని  ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది.

ఈ ఏడాది  ఏప్రిల్, మే మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఎస్పీ, ఆర్‌ఎల్డీలతో కలిసి బీఎస్పీ పోటీ చేసింది. అయితే ఈ కూటమి యూపీ రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ముఖ్యనాయకులతో బీఎస్పీ చీఫ్ మాయావతి సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలలో యాదవుల ఓట్లు చీలకుంగా నివారించడంలో  అఖిలేష్ యాదవ్ వైఫల్యం చెందారని మాయావతి ఆరోపించారు.

యూపీ రాష్ట్రంలోని 11 శాసనసభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనుందని ఆ పార్టీ సంకేతాలు ఇచ్చారు. అఖిలేష్ యాదవ్  తన భార్య డింపుల్ ‌ను కూడ  గెలిపించుకోలేకపోయారని ఆమె ఎద్దేవా చేసినట్టు సమాచారం.

click me!