పాండవుల వ్యూహాన్ని అమలు చేస్తోన్న మావోయిస్టులు

By sivanagaprasad kodatiFirst Published Oct 9, 2018, 7:35 AM IST
Highlights

మావోలు తెలివి మీరిపోయారు.. దండకారణ్యాన్ని భద్రతా దళాలు అష్టదిగ్బంధం చేస్తుండటం.. రోజు రోజుకి క్యాడర్ బలహీనమవుతుండటం.. ఆయుధాలు దాచే స్థావరాలు పోలీసులకు తెలిసిపోతుండటంతో మావోయిస్టులు విభిన్నంగా ఆలోచించారు.

మావోలు తెలివి మీరిపోయారు.. దండకారణ్యాన్ని భద్రతా దళాలు అష్టదిగ్బంధం చేస్తుండటం.. రోజు రోజుకి క్యాడర్ బలహీనమవుతుండటం.. ఆయుధాలు దాచే స్థావరాలు పోలీసులకు తెలిసిపోతుండటంతో మావోయిస్టులు విభిన్నంగా ఆలోచించారు.

నాడు మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచారు. వారి నుంచి స్ఫూర్తిని పొందారో ఏమో కానీ మావోలు కూడా తమ ఆయుధాలను సురక్షితంగా ఉంచడానికి చెట్లనే స్థావరాలుగా మలుచుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని వినప అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఒక చెట్టు తొర్రలో ఆయుధాలు బయటపడ్డాయి.. తుపాకులతో పాటు ఐఈడీ పేలుడు పదార్థాలను సీఆర్‌పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌‌లో పలు విధ్వంసకర ఘటనల్లో కీలకపాత్ర పోషించిన పోడియం ముడా అనే కీలక దళ సభ్యుడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. 2005 నుంచి 2018 వరకు జరిగిన 15 విధ్వంసకర ఘటనల్లో ఆయన పాల్గొన్నాడు. 117  మంది సీఆర్‌పీఎఫ్ బలగాల ప్రాణాలను బలిగొన్న ఘటనల్లో ముడా ప్రధాన సూత్రధారి.

ఒడిశాలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న ఆర్కే.. గాయపడి ఉండొచ్చా..?

ఎన్నికల బహిష్కరణకు మావోల పిలుపు

కిడారి హత్య : నాటుకోడి విందులో పోలీసులు.. జీలుగ కల్లు మత్తులో మావోలు

ఏవోబీలో మావోల బహిరంగ సభ:గురుప్రియను ఆపెయ్యాలి

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

మోదీ హత్యకు కుట్రపన్నలేదు:మావోలు లేఖ విడుదల

click me!