జడ్జ్ మీద చెప్పులు విసిరి నిరసన.. 18నెలల జైలుశిక్ష.. !

By AN TeluguFirst Published Jun 4, 2021, 4:19 PM IST
Highlights

తన కేసు చాలా కాలంగా పెండింగ్ లో ఉందనే ప్రస్టేషన్ తట్టుకోలేక ఓ వ్యక్తి నేరుగా హైకోర్ట్ జడ్జ్ మీదే చెప్పులు విసిరాడు. 2012లో అమ్మదాబాద్ లో జరిగిన ఈ ఘటనలో నిందితుడైన టీ వ్యాపారికి కోర్టు 18 నెలల జైలు శిక్షను విధించింది.

తన కేసు చాలా కాలంగా పెండింగ్ లో ఉందనే ప్రస్టేషన్ తట్టుకోలేక ఓ వ్యక్తి నేరుగా హైకోర్ట్ జడ్జ్ మీదే చెప్పులు విసిరాడు. 2012లో అమ్మదాబాద్ లో జరిగిన ఈ ఘటనలో నిందితుడైన టీ వ్యాపారికి కోర్టు 18 నెలల జైలు శిక్షను విధించింది.

ప్రభుత్వ ఉద్యోగిపై తన విధిని నిర్వర్తించకుండా అడ్డుకోవటానికి దాడి చేసిన ఆరోపణల మీద మిర్జాపూర్ గ్రామీణ కోర్టు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వి.ఎ.ధాధల్ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 నిందితుడు భవానిదాస్ బవాజీని దోషిగా తేల్చారు.

పోలీసులకు తన వాంగ్మూలంలో, బవాజీ తన కేసు సుదీర్ఘ పెండింగ్‌లో ఉన్నందున నిరాశతో న్యాయమూర్తిపై తన చెప్పులను విసిరినట్లు పేర్కొన్నాడు.

న్యాయమూర్తిపై చెప్పులు విసిరే చర్య "అస్సలు ఉపేక్షించకూడనిది" అని  మేజిస్ట్రేట్ ధాదల్ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ప్రొబేషన్ బెనిఫిట్స్ ఇవ్వడానికి నిరాకరించారు. కాకపోతే మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలను విడుదల చేసే నిబంధన పనిచేస్తుందని తెలిపారు. 

రాజ్‌కోట్‌లోని భయావదర్ పట్టణానికి చెందిన బవాజీకి మేజిస్ట్రేట్ 18 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.  అతని ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎటువంటి జరిమానా విధించలేదు.

కేసు వివరాల ప్రకారం, నిందితుడు 2012 ఏప్రిల్ 11 న విచారణ సందర్భంగా హైకోర్టు జస్టిస్ కెఎస్ ఝవేరిపై చెప్పులు విసిరారు. అదృష్టవశాత్తూ, జస్టిస్ ఝవేరికి చెప్పులు తగలలేదు. 

న్యాయమూర్తి ఈ చర్యకు కారణాన్ని అడిగినప్పుడు, బవాజీ తన కేసు చాలా కాలంగా విచారణకు రానందున, నిరాశతో అలా చేశానని చెప్పాడు. ఘటన జరిగిన వెంటనే బవాజీని సోలా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ అతని మీద చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

పోలీసుల దర్యాప్తులో బవాజీ భయావదర్‌లో రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్నట్లు తెలిసింది. భయావదర్ మునిసిపాలిటీ అతన్ని అక్కడినుంచి స్టాల్ తీసేయాల్సిందిగా ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ గోండల్ సెషన్స్ కోర్టు నుండి సివిక్ బాడీకి వ్యతిరేకంగా స్టే ఆర్డర్ పొందగలిగాడు, ఆ తరువాత మునిసిపాలిటీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.

ఈ అప్పీల్ ఆధారంగా మునిసిపాలిటీ తన టీ స్టాల్ తొలగించడంతో తాను నిరుద్యోగిగా మారిపోయానని పేర్కొన్నాడు. జీవనాధారం కోల్పోవడంతో కోర్టు విచారణలకు అహ్మదాబాద్ రావడానికి కూడా అప్పులు చేయాల్సి రావడంతో ఇలా చేయాల్సి వచ్చిందనిపేర్కొన్నాడు.

హై కోర్టు చుట్టూ తిరిగి విసిగిపోయాను. ఎంత కాలానికీ నా కేసు హియరింగ్ కు రావడం లేదు అందుకే ప్రస్టేషన్ లో చెప్పులు విసిరానని బవాజీ తెలిపాడు. 

కాగా, తన ఉత్తర్వులో, న్యాయాధికారి పెండింగ్ కారణంగా కేసులు సకాలంలో పరిష్కరించబడటం వాస్తవమే అయినప్పటికీ, హైకోర్టు న్యాయమూర్తి మీద చెప్పులు విసిరేందుకు ఇది ఒక కారణం కాదని అభిప్రాయపడ్డారు.

click me!