హత్రాస్ బాధితురాలంటూ మరో మహిళ పోటో పోస్టు: కోర్టును ఆశ్రయించిన వ్యక్తి

By narsimha lodeFirst Published Oct 16, 2020, 11:32 AM IST
Highlights

యూపీ రాష్ట్రంలోని హత్రాస్ రేప్ ఘటనలో మరణించిన యువతిగా చూపుతూ తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
 


న్యూఢిల్లీ: యూపీ రాష్ట్రంలోని హత్రాస్ రేప్ ఘటనలో మరణించిన యువతిగా చూపుతూ తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఢిల్లీ హైకోర్టు జడ్జి నవీన్ చావ్లా ఈ విషయమై కీలక ఆదేశాలిచ్చారు. బాధిత వ్యక్తి ఫిర్యాదు వాస్తవమని తేలితే గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ కు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ ఫిర్యాదును పరిశీలించాలని ఎలక్ట్రానిక్స్ , ఇన్పర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వశాఖ ను ఆదేశించింది కోర్టు. ఈ ఫిర్యాదు వాస్తవమని తేలితే ఈ ఆర్డర్ కాపీని అందుకొన్న మూడు రోజుల్లో ప్రతివాదులకు ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ లకు రెండు నుండి నాలుగు రోజుల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు కోరింది.

also read:హత్రాస్ కేసు:తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఫిర్యాదుదారుడు తన వాదనకు బలపర్చే ధృవపత్రాలను ఐటీ  మంత్రిత్వశాఖకు పంపాలని కోర్టు కోరింది.తప్పుడు ఫోటోను వాడిన యూఆర్ఎల్ లను కూడ అందించాలని సూచించింది.

గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్లతో పాటు ఐటీ మంత్రిత్వశాఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.హత్రాస్ ఘటనలో మృతిచెందిన యువతి ఫోటోను  తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారని కోర్టుకు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

అత్యాచార బాధితుడి గుర్తింపును బహిర్గతం చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం. తప్పుడు యూఆర్ఎల్ లను సమాచారం పంపితే ఆయా ఫ్లాట్‌ఫాంలను తీసివేయబడుతోందని కోర్టు తెలిపింది.


 

click me!