Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎవ‌రో తెలుసా?

Published : Jul 03, 2022, 01:39 PM IST
Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎవ‌రో తెలుసా?

సారాంశం

Maharashtra Assembly speaker: మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభ ప‌రిస్థితులు కాస్త కూల్‌గా మారుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీక‌ర్‌గా రాహుల్ న‌ర్వేక‌ర్ ఎన్నిక‌య్యారు.   

Maharashtra Political Crisis: శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కార‌ణంగా మ‌హారాష్ట్రలో ఒక్క‌సారిగి రాజ‌కీయాలు వేడిపుట్టించాయి. ఇక రెబ‌ల్ నాయ‌కుడు ఎక్‌నాథ్ షిండే.. బీజేపీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో రాజ‌కీయాలు కాస్త కూల్‌గా మారుతున్న ప‌రిస్థితులు క‌నిపించాయి. అయితే, ప్లోర్ టెస్టుకు ముందు స్పీక‌ర్ ఎన్నిక హాట్‌హాట్‌గా ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ థాక్రే వైదొల‌గే ప‌రిస్థితులకు దారితీసింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు థాక్రేపై తిరుగుబాటు చేశారు. గత వారం కొత్త ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం విశ్వాస తీర్మానానికి ముందు స్పీకర్ ఎన్నిక మినీ ఫ్లోర్ టెస్ట్‌గా మారింది. జై భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్ నినాదాల మధ్య మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. ఆయనకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. 107 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 

మ‌హారాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ ఎన్నిక ఓటింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండే బలపరీక్షను ఎదుర్కోనున్నారు. 

మ‌హారాష్ట్ర స్పీక‌ర్ గా ఎన్నికైన రాహుల్ నార్వేకర్ ఎవరు?

జై భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్ నినాదాల మధ్య మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. ఆయనకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. 107 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. రాహుల్ నార్వేకర్ దేశ ఆర్థిక రాధాజ‌ధాని ముంబ‌యిలోని  కోల్బా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర అసెంబ్లీకి చెందిన స‌భ్యులు. ఆయ‌న ముందు శివ‌సేన స‌భ్యులుగానే ఉన్నారు. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో శివ‌సేన‌కు గుడ్‌బై చెప్పి.. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కండువా క‌ప్పుకున్నారు. అలాగే, ఎన్సీపీలో చేరి మావల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కొలాబా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన ఎన్సీపీ సీనియర్ నేత రాంరాజే నాయక్ నింబాల్కర్ అల్లుడు. అతని తండ్రి కొలాబాలో మున్సిపల్ కౌన్సిలర్. అతని సోదరుడు, కోడలు 227, 226 వార్డు నెంబ‌ర్ల నుంచి కౌన్సిలర్‌లుగా ఎన్నిక‌య్యారు. 

ఎందుకు స్పీక‌ర్ ఎన్నిక‌? 

కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే రాజీనామా చేయడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి మ‌హారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. స్పీకర్‌గా డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఎన్నిక కోసం శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా ఉన్న ఉద్ధవ్ థాకరే విధేయుడు రాజన్ సాల్విపై  రాహుల్ నార్వేక‌ర్ గెలుపొందారు. 

షిండే ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్‌... 

స్పీకర్‌ను ఎన్నుకోవడంతో షిండే ప్రభుత్వం తదుపరి బలపరీక్షను ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. నాలుగు రోజుల శివసేన-బీజేపీ ప్రభుత్వం రెండు రోజుల ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. 288 మంది సభ్యుల సభలో, 10 మంది చిన్న పార్టీలు, స్వతంత్రులు ఉండ‌గా,  106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేకు మద్దతు ఇస్తున్నారు. శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 106 స్థానాలు ఉన్నాయి. 

Read more:

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ.. ప్ర‌ధాని మోడీపై మ‌రో మ‌నీహిస్ట్ పోస్ట‌ర్‌తో విమ‌ర్శ‌లు

Nupur Sharma: నుపూర్ శ‌ర్మ‌ను అరెస్టు చేయండి: జమాతే ఇస్లామీ హింద్

PM Modi Hyderabad Visit: కేసీఆర్ కుటుంబానిది రాజ‌కీయ స‌ర్క‌స్‌.. సీఎంపై స్మృతి ఇరానీ ఫైర్

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..