ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని.. శిశువు మృతదేహంతో పోలీసు స్టేషన్‌కు చేరిన తండ్రి

By Mahesh KFirst Published Jul 3, 2022, 1:04 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి శిశువు మృతదేహాన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు ఆరు నెలల గర్భిణి అయిన తన భార్యను కొట్టారని, ఆ కారణంగా ఆమె అకాలంలోనే శిశువును ప్రసవించాల్సి వచ్చిందని, ఆ శిశువు జన్మించిన కాసేపటికే మరణించిందని బాధితుడు తెలిపాడు. కానీ, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో ఆమె డెడ్ బాడీని చేతుల్లో పట్టుకుని స్థానికులను వెంటబెట్టుకుని పోలీసు స్టేషన్‌కు చేరాడు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడానికి మరణించిన తన కూతురు మృతదేహాన్ని చేతుల్లో పోలీసు స్టేషన్‌కు తెచ్చాడు. ఇద్దరు వ్యక్తులు గర్భవతి అయిన తన భార్యను కొట్టారని, ఆ దాడి కారణంగా ఆమె ఆరోగ్య స్థితి క్షీణించిందని, నెలలు నిండక ముందే ప్రసవించాల్సి వచ్చిందని, శిశువు జన్మించిన కొద్ది సేపటికే మరణించిందని ఆయన పోలీసులకు తెలిపాడు. ఆ ఇద్దరిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. కానీ, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించాడు. ఆయనను వెనక్కి పంపారు. దీంతో ఆయన శిశువు మృతదేహంతో తిరిగి పోలీసు స్టేషన్‌కు వచ్చాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ధనిరామ్ భార్య గర్భిణి. వారు పనికి వెళ్లుతుండగా ఇద్దరు వ్యక్తులు గుడ్డూ, రామస్వామ్‌లు అడ్డుకున్నారు. తన భార్యపై దాడి చేశారని ధనిరామ్ పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్య ఆరోగ్యం దారుణంగా క్షీణించిందని, పొట్ట నొప్పితో తల్లడిల్లిందని అన్నాడు. దీంతో తాను వెంటనే ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించానని వివరించాడు. అక్కడ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆమె శిశువును ప్రసవించిందని చెప్పాడు. అయితే, ఆ శిశువు జన్మించిన కాసేపటికే మరణించిందని వివరించాడు.

తన భార్య ఆరు నెలల గర్భవతి అని, ఆరు నెలలకే ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని బోరుమన్నాడు.

ఈ ఘటన తర్వాత ధనిరామ్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యపై దాడి చేసిన గుడ్డూ, రామస్వామ్‌లపై కేసు నమోదు చేయాలని కోరాడు. కానీ, వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి తిరస్కరించారు. దీంతో ధనిరామ్ చేసేదేమీ లేక మరణించిన శిశువు డెడ్ బాడీని చేతుల్లో పట్టుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రభాకర చౌదరిని ఆశ్రయించాడు. ప్రభాకర్ చౌదరి.. ధనిరామ్‌కు భరోసా ఇచ్చాడు. కచ్చితంగా ధనిరామ్‌కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. కేసు నమోదు చేయాలని ఫతేహాబాద్ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశాడు. దర్యాప్తు చేసి వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించాడు.

ప్రస్తుతం తన భార్య లేడీ ల్యాల్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు ధనిరామ్ తెలిపాడు.

click me!