Omicron: దేశంలో కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతున్నదని ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కొత్త కేసులు చూస్తే అర్థమవుతోంద. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో గరిష్ట పెరుగుదల ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర మంత్రి బాలసాహేబ్ కరోనా బారినపడ్డారు.
Omicron: భారత్ లో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర మళ్లీ కరోనా కేసుల హాట్ స్పాట్ గా మారుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 5,368 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ తో పోరాడుతూ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,70,754కు చేరాయి. మరణాలు 1,41,518కి పెరిగాయి. రాష్ట్రంలో ఇంకా 18,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం 3,671 కేసులు ఒక్క ముంబయిలోనే నమోదుకావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇక అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం మహారాష్ట్రలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే రాష్ట్రంలో 198 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసులు 450కి పెరిగాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలోనే నమోదుకావడం గమనార్హం.
Also Read: Omicron: మళ్లీ మహమ్మారి విజృంభణ.. ఒక్కవారంలోనే 50 లక్షలకు పైగా కొత్త కేసులు
undefined
ఇదిలావుండగా, అధికార యంత్రాంగంలోని వారు సైతం కరోనా బారినపడటం పెరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి బాలా సాహేబ్‌థోరట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా (కోవిడ్-19) పరీక్షలో పాజిటివ్‌గా వచ్చింది. అయితే, ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. కానీ వైద్యుల సలహా మేరకు తదుపరి చికిత్స తీసుకుంటాను. ఇటీవల నన్ను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోండి. ప్రతిఒక్కరు మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి” మంత్రి ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నదని సమాచారం.
Also Read: Chennai Rains: చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఇదిలావుండగా, దేశంలో ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 2,128 కరోనా కేసులు నమోదయయ్యాయి. అలాగే, వైరస్ కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనూ కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్నది. కేరళలో కొత్తగా 2,423 కరోనా కేసులు బయటపడ్డాయి. అలాగే, మరో 15 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. దేశరాజధాని ఢిల్లీలో చాలా కాలం తర్వత మళ్లీ ఇప్పుడు గరిష్టంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా అక్కడ 1,313 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,081కి పెరిగింది. గుజరాత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన తర్వాత సాధారణ కరోనాకేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుజరాత్లో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సెంచరీకి (97) చేరువయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. తెలంగాణలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఒత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కు పెరిగింది.
Also Read: De Kock: టెస్ట్ క్రికెట్ కు క్వింటన్ డికాక్ గుడ్‌బై.. జీవితంలో టైంను కొనలేమంటూ..
माझी कोरोना चाचणी पॉझिटिव्ह आलेली आहे.
मला कोणतेही लक्षणे नाही, तरीही डॉक्टरांच्या सल्ल्याने मी पुढील उपचार घेणार आहे.
माझ्या संपर्कात आलेल्यांनी आपली कोरोना चाचणी करून घ्यावी.
सगळ्यांना या निमित्ताने आवाहन करत आहे, आपण मास्क वापरावा, काळजी घ्यावी.