ఆన్ లైన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌.. కాస్లీ గిప్టులు, బంగారం.. తీరా చూస్తే.. రూ. 1.12 కోట్లు గుల్ల..

By Rajesh KarampooriFirst Published Nov 19, 2022, 6:27 PM IST
Highlights

ఆన్లైన్ వేదికలో పరిచయాలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించిన కొందరు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని నగలు,  బహుమతులు పంపిస్తానని ఓ మహిళ నుంచి రూ.1.12 కోట్లను కొల్లాగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో చోటుచేసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆన్ లైన్ మోసాలకు ప్రధాన కారణం మనిషి అత్యాశ. ఆ అత్యాశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో స్నేహం చేస్తున్నట్టు నమ్మించి..  బహుమతులు, బంగారం పంపిస్తామని ఓ మహిళ నుంచి రూ.1.12 కోట్లను కొల్లాగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో చోటుచేసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన ఓ మహిళ గతేడాది కోర్టు సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసింది. ఆమె ఇంటి వద్దే ఉంటూ.. సోషల్ మీడియాలో చాలా చురుకగా ఉండేది. ఈ క్రమంలో ఓ సోషల్ మీడియా వేదికలో బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ వచ్చింది. దీంతో సదరు మహిళ   ఫ్రెండ్ రిక్వెస్ట్‌ ను వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత.. అతనితో చాట్ చేయడం ఫోన్లు మాట్లాడం జోరుగా సాగింది. కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తితో పాటు మరికొందరు ఆ మహిళకు ఫోన్ చేయడం ప్రారంభించారు. ఆమెతో స్నేహం చేస్తున్నట్టు నటించారు.

 ఈ క్రమంలో యూకే నుంచి తనకు బంగారం, నగదు బహుమతులు పంపిస్తామని, అందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని వారు నమ్మించారు. దీంతో ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా.. ఆ వ్యక్తికి రూ.1.12 కోట్లు బదిలీ చేసింది. దీని తర్వాత వ్యక్తి , అతని సహచరులు వారి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడు ఆమెకు తెలిసి వచ్చింది.. తాను మోసపోయానని, వారు బహుమతుల పేరులో తన నుంచి భారీ మొత్తంలో నగదు కాజేశారని తెలుసుకుంది. దీంతో ఆ మహిళ అలీబాగ్ పోలీసులకు సమాచారం అందించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు చీటింగ్, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, కుట్ర కేసు నమోదు చేసినట్లు అలీబాగ్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సైబర్ మోసాన్ని ఎలా నివారించాలి

>> ఏదైనా తెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు.

>> మీ OTP మరియు ATM పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.

>> ఫ్రీబీస్ కాల్‌లపై అలర్ట్ పొందండి.

>> ఎవరైనా మీ ఖాతా KYC కోసం కాల్ చేస్తే, మీరే బ్యాంకుకు వెళ్తారని చెప్పండి.

>> ఎవరైనా ఖాతా సంబంధిత సహాయం పేరుతో కాల్ చేసి, యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగితే, ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయండి. 

>> అనుమానిత ఇ-మెయిల్‌లు, SMS  సందేశాలను తెరవడం లేదా క్లిక్ చేయడం మానుకోండి.

>> ఇమెయిల్‌లు, వెబ్‌సైట్‌లు మరియు తెలియని ఇ-మెయిల్ పంపేవారి స్పెల్లింగ్‌ని ఒకసారి చెక్ చేయండి.

>> వేర్వేరు సైట్‌లలో మీ పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయవద్దు. పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చండి. పాస్‌వర్డ్‌లను కష్టతరం చేయండి.

click me!