లఖింపూర్ ఖేరీ హింస కేసు.. బెయిల్‌పై జైలు నుంచి ఆశిష్ మిశ్రా విడుదల

By team teluguFirst Published Jan 28, 2023, 2:43 PM IST
Highlights

లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అశిష్ మిశ్రా బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. గత బుధవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఆయన యూపీ, ఢిల్లీలో ఉండకూడదని కండీషన్ పెట్టింది. 

లఖింపూర్ ఖేరీ హింస కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ విషయంలో ఖేరీ జిల్లా జైలు సీనియర్ సూపరింటెండెంట్ విపిన్ కుమార్ మిశ్రా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఆయన (ఆశిష్ మిశ్రా) జైలు నుండి విడుదలయ్యాడు. మాకు సెషన్స్ కోర్టు నుండి విడుదలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది.’’ అని తెలిపారు.

14యేళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్బవతిని చేసిన 48యేళ్ల వ్యక్తి.. దొంగతనం నేరం మోపి, బెదిరించి.. దారుణం..

ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు గత బుధవారం ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ వ్యవధిలో ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ లేదా ఢిల్లీలో ఉండరాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

2021 అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు హింస చెలరేగడంతో ఎనిమిది మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఆశిష్ మిశ్రా కూర్చున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో నలుగురు రైతులు మరణించారు.

బ్రేకప్ తో డిప్రెషన్.. మెర్సిడెస్ కారుకు నిప్పుపెట్టిన డాక్టర్..

ఈ సంఘటన తర్వాత ఆగ్రహించిన రైతులు ఆ ఎస్ యూవీ నడిపిన డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ హింసాకాండలో ఓ జర్నలిస్టు కూడా చనిపోయాడు. అయితే ఆశిష్ మిశ్రాను 2021 అక్టోబర్ 9న అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15, 2022న బెయిల్‌పై విడుదలయ్యారు. 2022 ఏప్రిల్ 18వ తేదీన ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారంలోగా లొంగిపోవాలని కోరింది.

వృద్ధుడిని పెళ్లి చేసుకున్న మహిళ.. వారం రోజులకే నగదు, ఆభరణాలతో పరార్..

దీంతో గతేడాది ఏప్రిల్ 24న ఆశిష్ మిశ్రా లొంగిపోయాడు. న్యాయంగా, నిష్పక్షపాతంగా, స్థిరపడిన పారామితులను దృష్టిలో ఉంచుకుని మూడు నెలలలోపు తాజా తీర్పు కోసం బెయిల్ దరఖాస్తును తిరిగి హైకోర్టుకు పంపింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గతేడాది జూలై 26న ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కాగా.. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా శుక్రవారం లఖింపూర్ ఖేరీ జిల్లాలో లేరు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆశిష్ మిశ్రాను జైలు నుంచి వెనుక గేటు ద్వారా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

click me!