రాజస్థాన్‌ భరత్‌పూర్‌‌లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఆ విషయంలో రాని స్పష్టత..!

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 12:40 PM IST
Highlights

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భరత్‌పూర్‌లో శనివారం ఉదయం ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. 

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భరత్‌పూర్‌లో శనివారం ఉదయం ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉచ్చైన్ ప్రాంతంలోని బహిరంగ మైదానంలో ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ సింగ్ తెలిపారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పారు. అయితే అది హెలికాప్టరా లేక విమానమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

మంటల తీవ్రత అధికంగా ఉందని.. అది డిఫెన్స్ యుద్ధ విమానమా లేదా హెలికాప్టర్ అని ప్రాథమికంగా చెప్పడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి ముందే పైలట్ బయటకు దూకేశాడనే ప్రచారం నేపథ్యంలో.. ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ద విమానాలు మధ్యప్రదేశ్‌లో కుప్పకులాయి. కుప్పకూలిన వాటిలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ద విమానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాల అక్కడికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు శిక్షణ, విన్యాసాల కోసం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అవి ఒకదానికొకటి ఢీకొని కూలిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

click me!