14యేళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్బవతిని చేసిన 48యేళ్ల వ్యక్తి.. దొంగతనం నేరం మోపి, బెదిరించి.. దారుణం..

Published : Jan 28, 2023, 01:04 PM IST
14యేళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్బవతిని చేసిన 48యేళ్ల వ్యక్తి.. దొంగతనం నేరం మోపి, బెదిరించి.. దారుణం..

సారాంశం

14యేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడో కసాయి. అది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అఘాయిత్యాన్ని కొనసాగించాడు. 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల మైనర్ బాలిక మీద ఓ నలభై ఎనిమిదేళ్ల వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి మీద దొంగతనం నేరం మోపి, బెదిరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలైన ఆ 14 ఏళ్ల బాలిక స్వయంగా తనకు జరిగిన అన్యాయం మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన  మహమ్మద్ ముఖరం అలీని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వారు ఈ మేరకు వివరించారు.. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నిందితుడికి కూల్ డ్రింక్ షాప్ ఉంది. బాధితురాలు తరచుగా అక్కడికి వెళ్లి కూల్ డ్రింకు కొనుక్కునేది. అలా ఒకసారి వెళ్లినప్పుడు నిందితుడు ఆమెను దొంగతనం చేశావంటూ భయపెట్టాడు. షాప్ లో సెల్ఫోన్ పోయిందని అది ఆమెనే తీసింది అని చెప్పి బెదిరించాడు.  దొంగతనం నేరం మోపి ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు.  పోలీసులకు ఫోన్ చేస్తానని, వారు పట్టుకుపోతారని బెదిరించాడు. దీంతో బాలిక భయపడింది.

బ్రేకప్ తో డిప్రెషన్.. మెర్సిడెస్ కారుకు నిప్పుపెట్టిన డాక్టర్..

తన ఇంటికి వస్తే ఈ విషయం ఎవరికీ చెప్పనని చెప్పాడు.  భయంతో దీనికి ఒప్పుకున్న బాలిక అతని వెంట ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె తాగే టీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు.  బాలిక స్పృహ తప్పిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటన అంతా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఆ వీడియోను బయటపెడతానని బెదిరిస్తూ పదేపదే అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో బాలిక  గర్భవతయింది. ఇటీవల ఢిల్లీలోని ఆ ఓ హాస్పిటల్ లో ఆ బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బాలిక మైనర్ కావడంతో హాస్పిటల్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.  దీనిమీద దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu