స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజా జోక్ మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తూ జోక్ వేయడంతో షిండే వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ముంబైలోని ఓ హోటల్‌పై దాడి జరిగింది, స్టాండప్ షోలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజా జోక్ మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. ఏక్‌నాథ్ షిండే వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతోంది.
కునాల్ కమ్రా తన యూట్యూబ్ , ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో పోస్ట్ చేసిన స్టాండప్ గిగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ షోలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఓ జోక్ వేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆయన మద్దతుదారులను తీవ్రంగా రెచ్చగొట్టాయి.
దీంతో ముంబైలోని ‘యూనికాంటినెంటల్’ హోటల్‌పై కొంతమంది దాడికి దిగారు. హోటల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, కునాల్ కమ్రాను హెచ్చరించారు. శివసేన షిండే వర్గానికి చెందిన కొందరు నేతలు కునాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ విడిపోయిన తీరును ఉద్దేశిస్తూ కునాల్ తన స్టాండప్ కామెడీలో కొన్ని సెటైరికల్ డైలాగులు వేశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఏం చేశారో చెప్పాల్సిందే... మొదట బీజేపీ నుంచి శివసేన విడిపోగా, ఆ తర్వాత శివసేన నుంచి శివసేన విడిపోయింది. ఎన్సీపీ నుంచి విడిపోయిన ఎన్సీపీ... చివరికి ఓటరుకు తొమ్మిది బటన్లు ఇచ్చింది.. అందరూ అయోమయానికి గురయ్యారు
అంతేకాదు, ‘దిల్ తో పాగల్ హై’ మూవీ పాటను మార్చి, రాజకీయాలను వ్యంగ్యంగా ద్రోహం అనే అర్థం వచ్చేలా పాడారు.
పరివార్వాద్ ఖతం కరేంగే అని చెబుతారు.. కానీ ఎవరో ఒకరి తండ్రినే లాక్కుంటారు.."
కునాల్ ఈ వ్యాఖ్యల్లో ఏక్‌నాథ్ షిండే పేరు నేరుగా చెప్పకపోయినా, థానే జిల్లా ప్రస్తావన కారణంగా ఆయనకే ఉద్దేశించినట్లు మద్దతుదారులు భావించారు.
కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడి చేసిన ఘటనలో శివసేన నేతలు రహూల్ కనాల్, శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాదు, స్టాండప్ కామెడీ తరచూ జరిగే ‘హాబిటెట్’ స్టూడియోపైనా ఆదివారం దాడి జరిగింది.
ఈ గొడవల కారణంగా హాబిటెట్ స్టూడియోని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
2022లో ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి శివసేనను చీల్చారు.
ఆయన వర్గం బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్సీపీ కూడా చీలిపోయింది. ఫలితంగా మహారాష్ట్రలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడ్డాయి.