Google Maps: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే.. కారును నదిలో పడేసింది !

Published : Jun 01, 2025, 05:30 PM IST
Google Maps Mishap: Car Plunges into River in Dhule

సారాంశం

Google Maps Mishap: ధూలేలో గూగుల్ మ్యాప్ చూపించిన దారిలో వెళ్లి కారు నదిలో పడిపోయింది. డిజిటల్ పరికరాలపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని మరోసారి ఘటనతో రుజువైంది. 

Google Maps Mishap: ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా మంది గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ దాదాపు అన్ని ప్రాంతాలకు దారిని చూపిస్తుంటుంది. అయితే, ఒక్కోసారి తప్పుదారులను కూడా చూపించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రమాదాలు కూడా జరిగాయి. అదే తరహాలో ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది. 

గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని వెళ్లి మహారాష్ట్రలోని ధూలే నగరంలో ఓ యువకుడి కారు నదిలో పడిపోయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. గూగుల్ మ్యాప్స్ తప్పుగా రూట్ ను చూపించడమే ఈ ప్రమాదానికి కారణం!

మే 31న మధ్యాహ్నం 1 గంటకు కాళికాదేవి ఆలయం దగ్గర ఈ ఘటన జరిగింది. అమరావతికి చెందిన కాశీనాథ్ ధుర్గాండే (35) అనే యువకుడు తన స్నేహితుడిని కలవడానికి దేవ్‌పూర్ వెళ్తున్నాడు. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ సెట్ చేసుకుని వెళ్తుండగా, వంతెన దగ్గర కారు నదిలో పడిపోయింది.

నదిలో నీరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది

నదిలో నీరు లేకపోవడంతో కాశీనాథ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. MH 22 BC 8808 నెంబర్ గల కారుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, మ్యాప్ నావిగేషన్ సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పుణేలో కారు బీభత్సం

ఇదిలావుండగా,  పుణేలోని సదాశివ్ పేట్ ప్రాంతంలో కారు బీభత్సం రేపింది.  ఓ కారు 12 మంది పాదచారులను ఢీకొట్టింది. క్షతగాత్రుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే హేమంత్ రాస్నే, సీఎం ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడి చికిత్స ఖర్చులు భరిస్తామని హామీ ఇప్పించారు.

గూగుల్ మ్యాప్ వాడేటప్పుడు జాగ్రత్త

డిజిటల్ పరికరాలపై అతిగా ఆధారపడటం ప్రమాదకరం. గూగుల్ మ్యాప్ దారి చూపించినా, జాగ్రత్తగా వాహనం నడపాలి. మ్యాప్‌పై పూర్తిగా ఆధారపడకూడదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?