
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ సీ. రాజగోపాలాచారి మనుమడు సీఆర్ కేశవన్ బీజేపీలో శనివారం చేరారు. ఆయనను కేంద్రమంత్రి వీకే సింగ్, బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడుకు చెందిన కేశవన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
బీజేపీలో చేరిక సందర్భంగా కేశవన్ మాట్లాడారు. ప్రజా కేంద్రీకృత విధానాలు, అవినీతి రహిత, సమ్మిళిత పాలనతో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ లో పెనుమార్పులకు నాంది పలికారని కొనియాడారు. దేశ భద్రతకు పెద్దపీట వేశారని, భారతదేశ చరిత్ర, సంప్రదాయాలను వివిధ కార్యక్రమాలతో జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ స్థాపకులైన తండ్రులు, తల్లుల పట్ల బీజేపీకి అపారమైన గౌరవం ఉందని కొనియాడారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా కేశవన్ ప్రశంసించారు.
చోరీ చేసి డబ్బు ఎత్తుకెళ్లారు.. తెల్లారి మళ్లీ అక్కడే వదిలివెళ్లారు.. ఛత్తీస్‌గఢ్ లో విచిత్ర ఘటన
అనంతరం వీకే సింగ్ మాట్లాడుతూ.. దేశానికి రాజగోపాలాచారి చేసిన సేవలను ప్రస్తావించారు. స్వాతంత్య్రానంతరం ఆయనను (కాంగ్రెస్ పార్టీ) పక్కన పెట్టారనీ, ఒకే కుటుంబం అన్నీ తామే చేశామని చెప్పుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. బీజేపీలో, తమిళనాడు రాజకీయాల్లో కేశవన్ బలమైన వాయిస్ గా నిలుస్తారని ఆయన అన్నారు.
ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. నిందితుడైన బాలుడు అరెస్టు..
కాగా.. గత కొద్ది రోజులుగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. ఇక్కడ రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పార్టీలోకి నేతలను చేర్చుకుంటోంది. ఇటీవలే కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనిని చేర్చుకుంది. రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.