శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

By narsimha lodeFirst Published Oct 15, 2018, 4:58 PM IST
Highlights

 అయ్యప్ప ఆలయంలోకి తాను వెళ్తానని కేరళకు చెందిన  రేష్మా నిశాంత్ తన ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్స్  ఉద్రిక్తతకు దారితీశాయి.


తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోకి తాను వెళ్తానని కేరళకు చెందిన  రేష్మా నిశాంత్ తన ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్స్  ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఫేస్‌బుక్ కామెంట్స్ చూసిన  పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లకుండా ఆమెను అడ్డుకొంటామని హెచ్చరించారు.

శబరిమల ఆలయంలోకి  మహిళలకు అనుమతిస్తూ  సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలనే  తీర్పును వెలువరించింది.  ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో రేష్మా నిశాంత్ ఆదివారం నాడు  తాను అయ్యప్పను దర్శించుకొంటానని ప్రకటించారు.

18 మెట్లెక్కి స్వామిని దర్శించుకొంటానని చెప్పారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ లో ఆమె చేసిన పోస్టుపై హిందూ ధార్మిక సంఘాలు  తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టు చూసిన హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకొన్నారు.  అయ్యప్ప ఆలయానికి వెళ్లకుండా అడ్డుకొంటామని హెచ్చరించారు. 

శబరిమలలో అయ్యప్పను దర్శించుకొనేందుకు మహిళలకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలనే తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయ్యప్ప దీక్షను చేపట్టినా కూడ  మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించకుండా చేయడం దారుణమన్నారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

click me!