టాయిలెట్‌ గోడలపై మహిళా పోలీసు నంబర్‌.. సెక్స్ వర్కర్ అనుకుని కాల్స్.. !

By AN TeluguFirst Published Dec 25, 2020, 3:38 PM IST
Highlights

మహిళా పోలీసునే వదలలేదో కామాంధుడు.. వెకిలి చేష్టలతో విసిగించాడు.. బెదిరించిందని ఆమె ఫోన్ నెం. ను జెంట్స్ పబ్లిక్ టాయిలెట్ లో రాసి హింసించాడు. చివరికి అరెస్టై ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ వీరిద్దరూ చిన్నప్పుడు క్లాస్ మేట్స్ కావడం విచిత్రం. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మహిళా పోలీసునే వదలలేదో కామాంధుడు.. వెకిలి చేష్టలతో విసిగించాడు.. బెదిరించిందని ఆమె ఫోన్ నెం. ను జెంట్స్ పబ్లిక్ టాయిలెట్ లో రాసి హింసించాడు. చివరికి అరెస్టై ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ వీరిద్దరూ చిన్నప్పుడు క్లాస్ మేట్స్ కావడం విచిత్రం. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కర్ణాటక, చిక్కమగళూరుకు చెందిన సతీశ్‌ సీఎం(33), బాధితురాలు(32) కలిసి చదువుకున్నారు. సతీష్ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమె పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరు మళ్లీ కలిశారు. వీరంతా కలిసి ఓ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. సతీశ్‌, బాధితురాలి నంబర్లు కూడా అందులో యాడ్‌ చేశారు. 

ఇక అప్పటి నుంచి సతీశ్‌ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తరచుగా మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ చేస్తూ వెకిలిగా మాట్లాడేవాడు. ఇందుకు ఆమె తీవ్రంగా స్పందించి, అతడికి వార్నింగ్‌ ఇచ్చింది. తనకే వార్నింగ్ ఇస్తుందా అనుకున్న సతీష్ కోపంతో ఆమె నెంబర్ ను వాట్సాప్‌ గ్రూపు నుంచి తీసేశాడు.  ఇతర స్నేహితులు మళ్లీ ఆమె నంబర్‌ను యాడ్‌ చేశారు. 

ఈ విషయంలో కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనవసరంగా తన విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆమె తీవ్రంగా హెచ్చరించింది. దీంతో సతీశ్‌ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో కడూర్‌ బస్టాండులోని పురుషుల టాయిలెట్‌ గోడలపై బాధితురాలి నంబరు రాసి, ఆమెను సంప్రదించాలంటూ నీచపు రాతలు రాశాడు. 

దీంతో మహిళా పోలీసుకు ఎడతెరపి లేకుండా ఫోన్‌కాల్స్‌ రావడం మొదలైంది. ఆమెను సెక్స్‌ వర్కర్‌గా భావించి అసభ్యకర సంభాషణలతో వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసిన పోలీసులు.. అతడిపై ఐపీసీ సెక్షన్లు 354డీ, 509 కింద కేసు నమోదు చేశారు.

click me!